3,168 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్
రాష్ట్రవ్యాప్తంగా ఖాళీ పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపిన ప్రభుత్వం... నేతన్న భరోసా కింద చేనేత కార్మికులకు రూ.25 వేల ఆర్థిక సాయం... గోదావరి పుష్కరాలకు రూ.50 కోట్లు, మార్షల్ ఆర్ట్స్ సెంటర్కు రూ.300 కోట్ల మంజూరు...
అమరావతి, జూలై 23 (వి10టివి): రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 3,168 ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయానికి ఆమోదం లభించింది. ఇదే సమావేశంలో చేనేత కార్మికులకు నేతన్న భరోసా పథకం కింద ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అలాగే గోదావరి పుష్కరాల నిర్వహణకు రూ.50 కోట్లను మంజూరు చేయడంతో పాటు, మార్షల్ ఆర్ట్స్ అభివృద్ధికి రూ.300 కోట్లతో ప్రత్యేక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయాలని కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ఉపాధి, సంక్షేమం, క్రీడా అభివృద్ధికి ఈ నిర్ణయాలు కీలకంగా మారనున్నాయి.

