అంబులెన్స్ డ్రైవర్లకు ఏసీపీ కౌన్సెలింగ్
రోగులు, వారి కుటుంబ సభ్యులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచన.. అంబులెన్స్ సేవల్లో నిర్లక్ష్యం, అధిక ఛార్జీలకు తావులేకుండా హెచ్చరిక... సేవాభావంతో విధులు నిర్వహించి ప్రభుత్వ ఆసుపత్రి ప్రతిష్ఠను కాపాడాలని పిలుపు...

అంబులెన్స్ డ్రైవర్లకు ఏసీపీ కౌన్సెలింగ్
రోగులు, వారి కుటుంబ సభ్యులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచన..
అంబులెన్స్ సేవల్లో నిర్లక్ష్యం, అధిక ఛార్జీలకు తావులేకుండా హెచ్చరిక...
సేవాభావంతో విధులు నిర్వహించి ప్రభుత్వ ఆసుపత్రి ప్రతిష్ఠను కాపాడాలని పిలుపు...
విజయవాడ,( v10tv):
విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి (జీజీహెచ్)లో విధులు నిర్వహిస్తున్న ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్లతో సెంట్రల్ ఏసీపీ సమావేశం నిర్వహించారు. రోగులు, వారి కుటుంబ సభ్యులతో మర్యాదపూర్వకంగా, గౌరవప్రదంగా వ్యవహరించాలని సూచించారు. అంబులెన్స్ సేవల పేరుతో ఎట్టి పరిస్థితుల్లోనూ అధిక ఛార్జీలు వసూలు చేయరాదని, ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా పాటించాలని హెచ్చరించారు. సేవాభావంతో పనిచేస్తూ ఆసుపత్రికి వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని డ్రైవర్లకు సూచించారు. సమావేశంలో ఆసుపత్రి అధికారులు, అంబులెన్స్ డ్రైవర్లు పాల్గొన్నారు.
