వీ10టీవీనిజం మీ ముందుకు
వీ10టీవీ
నిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

మమ్మల్ని అనుసరించండి

వార్తలు వెతకండి అడ్మిన్ లాగిన్

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/రోజువారీ వార్తలు/వార్త

ముస్తాబాద్ బాబా ఆలయంలో 28, 29 తేదీల్లో గురుపౌర్ణమి మహోత్సవాలు

రుద్రాభిషేకాలు, 108 కళశాభిషేకం, సాయిబాబాకు 108 కేజీల పుష్పాభిషేకం పల్లకీ సేవ, గ్రామోత్సవం, అన్నసమారాధనతో వైభవంగా వేడుకలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని ట్రస్ట్ విజ్ఞప్తి

V10TV న్యూస్ డెస్క్24 జులై, 2026 4:45 AM 0
ముస్తాబాద్ బాబా ఆలయంలో 28, 29 తేదీల్లో గురుపౌర్ణమి మహోత్సవాలు — చిత్రం 11 / 1
WhatsApp FacebookX Telegram
విజయవాడ, జూలై 24 (వి10టివి): కృష్ణాజిల్లా గన్నవరం మండలం ముస్తాబాద్‌లోని శ్రీ విజయదుర్గ సమేత శ్రీ మల్లికార్జున స్వామి, శ్రీ సద్గురు సాయినాథ స్వామి ఆలయంలో ఈ నెల 28, 29 తేదీల్లో గురుపౌర్ణమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ట్రస్ట్ చైర్‌పర్సన్ జి.వి.ఎస్. పద్మావతి తెలిపారు. మంగళవారం అభయ ఆంజనేయస్వామికి అభిషేకం, కదళఫలాలతో విశేష అర్చన నిర్వహించనున్నారు. బుధవారం గురుపౌర్ణమి సందర్భంగా విఘ్నేశ్వర పూజ, మహాన్యాస పారాయణం, ఏకాదశ రుద్రాభిషేకం, అమ్మవారికి 108 కళశాభిషేకం, దక్షిణామూర్తి, గురు రాఘవేంద్రస్వాములకు అభిషేకాలు, సద్గురు సాయినాథ స్వామికి 108 కేజీల పుష్పాభిషేకం, సత్యనారాయణ వ్రతం, సాయంత్రం పల్లకీ సేవ, గ్రామోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 11 గంటలకు అన్నసమారాధన కూడా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. యాగ్నిక బ్రహ్మ శ్రీకరం మురళీ శర్మ, ఆలయ అర్చకులు ఇటికాల నాగ పవన్ కుమార్ శర్మల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరుగనున్నాయని, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని ట్రస్ట్ ప్రతినిధులు కోరారు.
WhatsApp FacebookX Telegram

తాజా వార్తలు

సీపీఎం నేతలపై నమోదైన కేసు కొట్టివేత.. ఆరేళ్ల న్యాయపోరాటానికి ముగింపు

3 గంటల క్రితం 0

ఫ్యూచర్ పోలీసింగ్'పై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

13 గంటల క్రితం 20

కురుమద్దాలి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి దుర్మరణం

16 గంటల క్రితం 1

పేదల వైద్యానికి పెద్దపీట.. ఎల్‌ఓసీలతో ఆర్థిక భరోసా

17 గంటల క్రితం 0