కొత్త చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించిన పోలీసులు
కృష్ణలంకలో ఏపిఎస్ఆర్ఎం కళాశాలలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం.. బీఎన్‌ఎస్, బీఎన్‌ఎస్‌ఎస్, బీఎస్‌ఏ చట్టాలపై వివరించిన పోలీసులు.. ర్యాగింగ్, సైబర్ నేరాలు, మహిళల భద్రతపై అప్రమత్తంగా ఉండాలని సూచన..

విజయవాడ, జూలై 20 :
విజయవాడ కృష్ణలంకలోని ఏపిఎస్ఆర్ఎం కళాశాలలో విద్యార్థులకు కొత్త క్రిమినల్ చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఐ మురళీకృష్ణ బీఎన్‌ఎస్ (భారతీయ న్యాయ సంహిత), బీఎన్‌ఎస్‌ఎస్ (భారతీయ నాగరిక సురక్షా సంహిత), బీఎస్‌ఏ (భారతీయ సాక్ష్యాధార చట్టం) ప్రధాన అంశాలను విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా వివరించారు.అలాగే ర్యాగింగ్ వల్ల ఎదురయ్యే చట్టపరమైన పరిణామాలు, సైబర్ నేరాల నుంచి ఎలా రక్షించుకోవాలి, మహిళల భద్రత, సోషల్ మీడియా వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. నేరాల నివారణలో యువత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఎలాంటి అనుమానాస్పద ఘటనలు జరిగినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు సూచించారు.కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. పోలీసులు చెప్పిన సూచనలను విద్యార్థులు ఆసక్తిగా విని సందేహాలను నివృత్తి చేసుకున్నారు.
