తల్లికి వందనం' రెండో విడత నిధుల విడుదలకు స్వాగతం.. లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం
నెహ్రూ బొమ్మ సెంటర్‌లో తెలుగు యువత ఆధ్వర్యంలో కార్యక్రమం సూపర్-6 హామీల అమలులో మరో కీలక అడుగు అని ఆర్. మాధవ వ్యాఖ్య లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నిధుల జమపై హర్షం వ్యక్తం
చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
విజయవాడ, జూలై 23 (వి10టివి): రాష్ట్ర ప్రభుత్వం 'తల్లికి వందనం' పథకం రెండో విడత నిధులను విడుదల చేసిన సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తెలుగు యువత ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ (చిన్ని) ఆదేశాల మేరకు పశ్చిమ నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు ఆర్. మాధవ నాయకత్వంలో నెహ్రూ బొమ్మ సెంటర్ వద్ద విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా ఆర్. మాధవ మాట్లాడుతూ, యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం 'తల్లికి వందనం' పథకం రెండో విడత నిధులను విడుదల చేసిందన్నారు. ఈ విడతలో 67,47,119 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.10,120.78 కోట్లను నేరుగా జమ చేయడం ద్వారా ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుందని పేర్కొన్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సవాళ్లతో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాల అమలుకు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. అలాగే మున్సిపల్ కార్మికులు, అంగన్వాడీ సిబ్బందికి కూడా 'తల్లికి వందనం' పథకాన్ని విస్తరించడం

అభినందనీయమన్నారు.
ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలనపై ఆర్. మాధవ విమర్శలు చేశారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని, విద్యార్థులు, యువతకు చేసిన వాగ్దానాలు నెరవేర్చలేదని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు తీసుకురావడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని, తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నగరాల కార్పొరేషన్ డైరెక్టర్ సుఖాసి కిరణ్ కుమార్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ధనేకుల హరికృష్ణ (నాని), టీఎన్‌టీయూసీ నాయకుడు లింగంపల్లి మోహన్, తెలుగు యువత పశ్చిమ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కుప్పిలి నాగబాబు, టీఎన్‌ఎస్‌ఎఫ్ పశ్చిమ నియోజకవర్గ అధ్యక్షుడు మోడీ రాజు, ప్రధాన కార్యదర్శి మణికంఠ, తెలుగు యువత నాయకులు నాగోటి వెంకటేష్, పైలా దుర్గారావు, వీర్ల వాసు, బాలకృష్ణ, వేల్పుల నరసింహారావు, రామ్, పిల్ల సూరిబాబు, మోరబోయిన శ్రీను, డొక్కు దినేష్, మైలపల్లి అప్పన్న, వడ్డే శంకర్, ఆకుల నాగు, పిల్ల వంశీ, తాటి పిల్ల శివ తదితరులు పాల్గొన్నారు.

