ఆషాడ భక్తి వెల్లువలో కనకదుర్గమ్మకు సారె సమర్పణ
జై దుర్గా నామస్మరణలతో ఇంద్రకీలాద్రికి నడకయాత్ర చిన్నారుల నుంచి మహిళల వరకు భక్తుల భారీ పాల్గొనం పదేళ్లుగా కొనసాగుతున్న ఆధ్యాత్మిక సంప్రదాయం
చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
విజయవాడ
25-07-2026 (వి10టివి):
ఆషాడ మాసం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో భక్తి పారవశ్యం నెలకొంది. ఈ సందర్భంగా శనివారం మల్లికార్జునపేట ఆకులవారి వీధికి చెందిన రామిశెట్టి సాంబశివరావు–శాంతికుమారి దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ఘనంగా ఆషాడ సారె సమర్పించారు.
ముందుగా బ్రాహ్మణవీధిలోని జమ్మిదొడ్డి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ కార్పొరేటర్లు మైలవరపు రత్నకుమారి దుర్గారావు, ఉమ్మడి వెంకటేశ్వరరావు (చంటి) ముఖ్య అతిథులుగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ వందలాది మంది మహిళలు, చిన్నారులు

భక్తిశ్రద్ధలతో ఆషాడ సారెను చేతబూని "జై దుర్గా.. జై జై దుర్గా" నామస్మరణలతో ఇంద్రకీలాద్రికి నడుచుకుంటూ వెళ్లి అమ్మవారికి సమర్పించారు.
బెజవాడ కనకదుర్గమ్మను తమ ఇంటి ఆడపడుచుగా భావిస్తూ గత పదేళ్లుగా పవిత్ర ఆషాడ మాసంలో ఈ సేవను నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ భక్తులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పెద్ద పల్లంటి గంగాధర్, మైలవరపు దుర్గారావు, మాతా శివ, పల్లంటి జగం, దొడ్ల సుజాత, రామిశెట్టి షణ్ముఖ మణిదీప్, చందనతో పాటు స్థానిక మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

