హెచ్‌ఐవీపై అవగాహనే ఆయుధం.. పరీక్షతోనే నిర్ధారణ
ఎన్టీఆర్ జిల్లాలో కళాబృందం ద్వారా హెచ్‌ఐవీ/ఎయిడ్స్ నివారణపై ప్రజలకు అవగాహన... ICTC కేంద్రాల్లో ఉచిత రక్త పరీక్షలు.. నిర్ధారణ అయితే ART మందులు ఉచితంగా అందుబాటులో... HIV ACT-2017, 1097 టోల్‌ఫ్రీ నంబర్‌తో పాటు టీబీ వ్యాధిపైనా విస్తృత ప్రచారం...

విజయవాడ: హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై అపోహలను వీడి, వ్యాధి వ్యాప్తి మార్గాలు, నివారణ చర్యలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని ఎం.గంగాధర్ కళాబృందం సభ్యులు ప్రజలకు వివరించారు. రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో జిల్లా ఎయిడ్స్ నియంత్రణ, నివారణ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో ప్రజలకు హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా హెచ్‌ఐవీ ఎలా వ్యాపిస్తుంది, ఎలాంటి పరిస్థితుల్లో వ్యాపించదు, వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలను కళారూపాల ద్వారా ప్రజలకు వివరించారు. హెచ్‌ఐవీపై ఉన్న అపోహలు, భయాలను తొలగించడంతో పాటు అనుమానం ఉన్నవారు సంకోచించకుండా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
హెచ్‌ఐవీ నిర్ధారణ కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ హెల్త్ సెంటర్లలో ఏర్పాటు చేసిన ICTC కేంద్రాలకు వెళ్లి రక్త పరీక్షలు చేయించుకోవచ్చని తెలిపారు. హెచ్‌ఐవీ నిర్ధారణ అయిన వారికి ART మందులు ఉచితంగా అందుబాటులో ఉంటాయని వివరించారు.
అలాగే హెచ్‌ఐవీ బాధితుల హక్కులు, వివక్ష నుంచి రక్షణ కల్పించే HIV/AIDS (Prevention and Control) Act-2017, హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌కు సంబంధించిన సమాచారం, సలహాల కోసం అందుబాటులో ఉన్న 1097 టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్ గురించి అవగాహన కల్పించారు. టీబీ వ్యాధి, దాని నివారణ, పరీక్షలు, చికిత్సకు సంబంధించిన అంశాలను కూడా ప్రజలకు వివరించారు.
కార్యక్రమంలో ఎం.గంగాధర్, ఎం.రాము, శ్రీ రవికుమార్, మహేష్, రంగనాయకి, గైడ్ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్ట్ మేనేజర్ కె.సుజాతతో పాటు సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.విజయవాడ: హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై అపోహలను వీడి, వ్యాధి వ్యాప్తి మార్గాలు, నివారణ చర్యలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని ఎం.గంగాధర్ కళాబృందం సభ్యులు ప్రజలకు వివరించారు. రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో జిల్లా ఎయిడ్స్ నియంత్రణ, నివారణ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో ప్రజలకు హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా హెచ్‌ఐవీ ఎలా వ్యాపిస్తుంది, ఎలాంటి పరిస్థితుల్లో వ్యాపించదు, వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలను కళారూపాల ద్వారా ప్రజలకు వివరించారు. హెచ్‌ఐవీపై ఉన్న అపోహలు, భయాలను తొలగించడంతో పాటు అనుమానం ఉన్నవారు సంకోచించకుండా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
హెచ్‌ఐవీ నిర్ధారణ కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ హెల్త్ సెంటర్లలో ఏర్పాటు చేసిన ICTC కేంద్రాలకు వెళ్లి రక్త పరీక్షలు చేయించుకోవచ్చని తెలిపారు. హెచ్‌ఐవీ నిర్ధారణ అయిన వారికి ART మందులు ఉచితంగా అందుబాటులో ఉంటాయని వివరించారు.
అలాగే హెచ్‌ఐవీ బాధితుల హక్కులు, వివక్ష నుంచి రక్షణ కల్పించే HIV/AIDS (Prevention and Control) Act-2017, హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌కు సంబంధించిన సమాచారం, సలహాల కోసం అందుబాటులో ఉన్న 1097 టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్ గురించి అవగాహన కల్పించారు. టీబీ వ్యాధి, దాని నివారణ, పరీక్షలు, చికిత్సకు సంబంధించిన అంశాలను కూడా ప్రజలకు వివరించారు.
కార్యక్రమంలో ఎం.గంగాధర్, ఎం.రాము, శ్రీ రవికుమార్, మహేష్, రంగనాయకి, గైడ్ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్ట్ మేనేజర్ కె.సుజాతతో పాటు సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.