అన్నార్థులకు ఆపన్నహస్తం.. అన్నప్రసాద వితరణ
లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ సుప్రీమ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం.. అన్నప్రసాద వితరణను ప్రారంభించిన లయన్స్ జిల్లా 316డి క్యాబినెట్ కార్యదర్శి ఎం. రవీంద్ర.. భక్తులు, అన్నార్థులకు స్వయంగా ఆహారం వడ్డించిన లయన్స్ సభ్యులు..


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
విజయవాడ, ఆగస్టు 23: సేవా కార్యక్రమాల్లో భాగంగా లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ సుప్రీమ్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత అన్నప్రసాద వితరణ నిర్వహించారు. విజయవాడ రథం సెంటర్ సమీపంలోని అప్పన వెంకట కృష్ణయ్య ధర్మసత్రంలో అప్పన వెంకట కృష్ణయ్య కామేశ్వరమ్మ చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో నిర్వహించిన కార్యక్రమాన్ని లయన్స్ జిల్లా 316డి క్యాబినెట్ కార్యదర్శి లయన్ ఎం. రవీంద్ర ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఆకలితో ఉన్న వారికి అన్నం అందించడం గొప్ప సేవ అని, ఇటువంటి కార్యక్రమాల ద్వారా సమాజానికి తమవంతు సహకారం అందిస్తున్నామని తెలిపారు. స్థానికులతో పాటు కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చిన పలువురు భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు.

కార్యక్రమంలో చైర్మన్ లయన్ అప్పన వెంకట సత్యసాయిబాబు, మధురవాణి దంపతులు, క్లబ్ అధ్యక్షుడు లయన్ గొటిక నాగిరెడ్డి, కోశాధికారి లయన్ నరసింహారావు, పూర్వ అధ్యక్షుడు, జోన్ చైర్‌పర్సన్ లయన్ అన్నే సాంబశివరావు, సభ్యులు లయన్ సురేష్, వాసవి ప్రశాంత్ తదితరులు పాల్గొని భక్తులు, అన్నార్థులకు స్వయంగా ఆహారాన్ని వడ్డించారు.

