బాణసంచా దుకాణాల భద్రతపై కలెక్టర్ ప్రత్యేక నిఘా!
ప్రతి పది నిమిషాలకు భద్రతా సమాచారం అందించాలి… నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: కలెక్టర్ హెచ్చరిక… పోలీసు, అగ్నిమాపక శాఖల అధికారులతో సమన్వయానికి ఆదేశాలు…

విజయవాడ, నవంబర్ 7: దీపావళి సందర్భంగా ఏర్పాటు చేసిన బాణసంచా దుకాణాల వద్ద భద్రతా చర్యలను మరింత పటిష్టం చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రతి పది నిమిషాలకు ఒకసారి మైక్ ద్వారా భద్రతా సూచనలు అందించాలని స్పష్టం చేశారు. బాణసంచా కొనుగోలు చేసేందుకు వచ్చే ప్రజలకు తెలుగు, ఆంగ్ల భాషల్లో భద్రతా సూచనలు వినిపించాలని సూచించారు. దుకాణాల పరిసరాల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా నిరంతర నిఘా ఉంచాలని ఆదేశించారు. రోజుకు రెండుసార్లు తనిఖీలు బాణసంచా విక్రయ కేంద్రాలను రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక శాఖల అధికారులు సమన్వయంతో పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు. రోజుకు రెండుసార్లు తనిఖీలు నిర్వహించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించాలన్నారు. నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు అనుమతులు, భద్రతా నిబంధనలను ఉల్లంఘించే దుకాణాలపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తనిఖీల వివరాలు, తీసుకున్న చర్యలను సింగిల్ విండో విధానం ద్వారా నమోదు చేయాలని స్పష్టం చేశారు.

