ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ1, నవంబర్ 2026, ఆదివారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

జి3 థియేటర్‌లో అడ్డగోలు దోపిడీ?

తినుబండారాల ధరలు భారీగా.. నాణ్యత, పరిమాణం అంతంతే అంటూ ప్రేక్షకుల అసంతృప్తి... చెల్లిస్తున్న ధరకు తగ్గ విలువ ఎక్కడంటూ ప్రశ్నలు.. తనిఖీలు చేపట్టాలని డిమాండ్... ఆహార భద్రత, సంబంధిత శాఖల పర్యవేక్షణపై విమర్శలు.. అధికారులు స్పందించాలని వినతి...

V10TV న్యూస్ డెస్క్ 22 ఆగస్టు, 2026 4:37 PMకి 2,440 వీక్షణలు
జి3 థియేటర్‌లో అడ్డగోలు దోపిడీ? — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

గుడివాడ: పట్టణంలోని భాస్కర్ జి3 థియేటర్‌లో విక్రయిస్తున్న తినుబండారాల ధరలు, నాణ్యత, పరిమాణంపై పలువురు ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆహార పదార్థాలకు అధిక ధరలు చెల్లిస్తున్నప్పటికీ అందుకు తగిన నాణ్యత, పరిమాణం లభించడం లేదని ఆరోపిస్తున్నారు.

సినిమా చూసేందుకు వచ్చే ప్రేక్షకులు థియేటర్‌లో అందుబాటులో ఉండే తినుబండారాలను కొనుగోలు చేస్తుంటారు. అయితే బయట మార్కెట్‌తో పోలిస్తే ధరలు ఎక్కువగా ఉన్నాయని, కనీసం చెల్లిస్తున్న మొత్తానికి తగ్గ పరిమాణం, నాణ్యత ఉండాలని ప్రేక్షకులు కోరుతున్నారు. “డబ్బులు మాత్రం ఎక్కువగా తీసుకుంటున్నారు.. మరి ఆ ధరకు తగ్గ నాణ్యత, పరిమాణం ఎక్కడ?” అంటూ ప్రశ్నిస్తున్నారు.

థియేటర్‌లో విక్రయించే ఆహార పదార్థాల ధరల ప్రదర్శన, బిల్లుల జారీ, ప్యాకేజ్డ్ వస్తువుల ఎంఆర్‌పీ, తయారీ–గడువు తేదీలతో పాటు అక్కడే తయారు చేసే పదార్థాల నాణ్యత, పరిశుభ్రత తదితర అంశాలను సంబంధిత అధికారులు పరిశీలించాలని కోరుతున్నారు.

ముఖ్యంగా ఆహార భద్రత అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించి నాణ్యత ప్రమాణాలను పరిశీలించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ కొరవడటం వల్లే ఇష్టారాజ్యంగా ధరలు నిర్ణయిస్తున్నారనే ఆరోపణలకు అవకాశం కలుగుతోందని అంటున్నారు.

అయితే ప్రేక్షకులు చేస్తున్న ఆరోపణలపై థియేటర్ యాజమాన్యం వివరణ కూడా తీసుకోవాల్సి ఉంది. వాస్తవంగా నిబంధనల ఉల్లంఘన జరుగుతోందా లేదా అనేది అధికారుల తనిఖీల్లో తేలాల్సి ఉంది. ప్రేక్షకుల ఆరోగ్యం, వినియోగదారుల హక్కులను దృష్టిలో పెట్టుకుని సంబంధిత శాఖలు తనిఖీలు నిర్వహించి, ఉల్లంఘనలు గుర్తిస్తే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

పులివెందులలో జగన్ సంచలన ప్రకటన.. ‘నేను ఓటు వేయను!’

4 గంటల క్రితం 9,653

బెజవాడలో ఓటుకు దూరంగా మెజారిటీ ఓటర్లు!

4 గంటల క్రితం 8,666

పులివెందుల ఆర్వో ఆఫీస్ వద్ద ఉద్రిక్తత.. జగన్ నేలపై కూర్చొని నిరసన!

5 గంటల క్రితం 9,565

కుటుంబంతో కలిసి ఓటేసిన బొండా ఉమా.. ప్రజాస్వామ్య పండుగలో భాగస్వామ్యం!

5 గంటల క్రితం 17,896