ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ9, సెప్టెంబర్ 2026, బుధవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

అమ్మకానికి కాదు.. ‘గబ్బర్ సింగ్‌’కు గిఫ్ట్!

పొట్టిలంక నర్సరీలో ఆకట్టుకుంటున్న అరుదైన ‘వృక్ష గణపతి’... రెండేళ్ల శ్రమతో తొమ్మిది అడుగుల గణనాథుడికి జీవరూపం... పవన్ కళ్యాణ్ అవకాశం ఇస్తే కానుకగా అందిస్తానంటున్న యువ రైతు ధనరాజు...

V10TV న్యూస్ డెస్క్ 9 సెప్టెంబర్, 2026 11:10 AMకి 2,578 వీక్షణలు
అమ్మకానికి కాదు.. ‘గబ్బర్ సింగ్‌’కు గిఫ్ట్! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

తూర్పుగోదావరి జిల్లా, కడియం మండలం, పొట్టిలంక, సెప్టెంబరు 9: మట్టిలో మొలిచిన మొక్కకు కళాత్మక రూపమిస్తే... అదే గణనాథుడిగా దర్శనమిస్తే ఎలా ఉంటుంది? కడియం మండలం పొట్టిలంకలోని మురుగన్ నర్సరీలో యువ రైతు దూలం ధనరాజు రెండేళ్ల శ్రమతో తీర్చిదిద్దిన ‘వృక్ష గణపతి’ ఇప్పుడు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

గణపతి నవరాత్రులు సమీపిస్తున్న వేళ వినూత్న గణనాథుల ప్రతిమలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ధనరాజు ఏకంగా సజీవ మొక్కలతో గణపతి ఆకృతిని తీర్చిదిద్దారు. సుమారు తొమ్మిది అడుగుల ఎత్తు, నాలుగు అడుగుల వెడల్పుతో రూపొందిన ఈ వృక్ష గణపతి ప్రత్యేక ఆకర్షణగా మారింది.

ముందుగా ఇనుప తీగలతో గణపతి ఆకారాన్ని రూపొందించి, నాలుగు మాల్పీజియా తీగజాతి మొక్కలను దానికి అమర్చారు. మొక్కలు పెరిగే కొద్దీ వాటిని గణపతి ఆకృతిలో అల్లుకుంటూ, అవసరమైన చోట కత్తిరిస్తూ రెండేళ్లపాటు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. చివరకు పచ్చని మొక్కల మధ్య గణనాథుడి రూపం స్పష్టంగా కనిపించేలా తీర్చిదిద్దారు.

పదో తరగతి వరకు చదివిన ధనరాజుకు చిన్ననాటి నుంచే బొమ్మల తయారీపై ఆసక్తి. అదే ఆసక్తితో నర్సరీ రంగంలోకి అడుగుపెట్టి మొక్కలతో విభిన్న ఆకృతులను రూపొందిస్తున్నారు. చెస్ హార్స్, గిటార్, గార్డెన్ లైట్, వివిధ పుష్పాకృతుల్లో ఆయన తీర్చిదిద్దుతున్న మొక్కలకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆదరణ లభిస్తోందని తెలిపారు.

‘పవన్‌కు కానుకగా ఇస్తా’

ఈ వృక్ష గణపతికి ఎంత ధర ఇచ్చినా అమ్మేది లేదని ధనరాజు స్పష్టం చేశారు. తన అభిమాన నేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అవకాశం కల్పిస్తే ఆయన పార్టీ కార్యాలయం లేదా ఫామ్‌హౌస్‌లో ఏర్పాటు చేసుకునేందుకు కానుకగా అందిస్తానని తెలిపారు. రెండేళ్ల తన శ్రమకు పవన్ కళ్యాణ్ నుంచి ప్రశంస లభిస్తే అదే తనకు గొప్ప గుర్తింపని ధనరాజు పేర్కొన్నారు

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

వినాయక మండపాల అనుమతులకు ఈ-పోర్టల్

14 నిమిషాల క్రితం 0

మైలవరంలో 5 వేల కుటుంబాలకు చేరిన ‘ఇంటింటికి తెలుగుదేశం’

26 నిమిషాల క్రితం 1,654

అపాయం అంచున వ్యక్తి.. అండగా నిలిచిన కానిస్టేబుల్

36 నిమిషాల క్రితం 2,474

రాత్రి 10.30 దాటినా మద్యం విక్రయాలా?

45 నిమిషాల క్రితం 2,490