సమన్వయంతోనే డివిజన్ అభివృద్ధి!
36వ డివిజన్ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తా: కార్పొరేటర్ ఏలూరు సాయి శరత్... ప్రజా సమస్యలను ఎమ్మెల్యే సుజనా చౌదరి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తా... కూటమి నేతల సహకారంతో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తా...

విజయవాడ, నవంబర్ 4: విజయవాడ నగరపాలక సంస్థ 36వ డివిజన్ అభివృద్ధికి అన్ని వర్గాల సహకారంతో సమన్వయంగా పనిచేస్తానని నూతన జనసేన కార్పొరేటర్ ఏలూరు సాయి శరత్ స్పష్టం చేశారు. కార్పొరేటర్‌గా విజయం సాధించిన ఆయన బుధవారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సాయి శరత్‌కు ప్రత్తిపాటి శ్రీధర్ పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ ఏలూరు సాయి శరత్ మాట్లాడుతూ తన విజయానికి సహకరించిన పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరితోపాటు బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో ఓటు వేసి గెలిపించిన ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటానని పేర్కొన్నారు. 36వ డివిజన్ పరిధిలో నెలకొన్న ప్రజా సమస్యలను గుర్తించి ఎమ్మెల్యే సుజనా చౌదరి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ముఖ్యంగా మౌలిక సదుపాయాల కల్పన, పారిశుద్ధ్యం, తాగునీరు, రహదారులు, వీధిదీపాల వంటి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తానని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా డివిజన్ ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ సేవలందిస్తానని, కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసికట్టుగా పనిచేసి 36వ డివిజన్‌ను అభివృద్ధి పథంలో నడిపిస్తానని కార్పొరేటర్ ఏలూరు సాయి శరత్ వెల్లడించారు.

