మేయర్ వంగవీటి రాధాకృష్ణకు ఘన సత్కారం!
భారీ మెజారిటీతో విజయం సాధించిన రాధాకృష్ణకు అభినందనలు... పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించిన జనసేన నేతలు... రాధాకృష్ణ నాయకత్వంలో బెజవాడ అభివృద్ధి పరుగులు తీయాలని ఆకాంక్ష...

విజయవాడ, నవంబర్ 4: విజయవాడ నగరపాలక సంస్థ మేయర్‌గా భారీ మెజారిటీతో ఘన విజయం సాధించిన వంగవీటి రాధాకృష్ణకు జనసేన పార్టీ సీనియర్ నాయకులు పెనుగొండ సుబ్బారాయుడు, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ అభినందనలు తెలిపారు. బుధవారం పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాల మేరకు బందరు రోడ్డులోని వంగవీటి రాధాకృష్ణ కార్యాలయానికి వెళ్లి ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో ఘనంగా సత్కరించారు. మేయర్ ఎన్నికల్లో వంగవీటి రాధాకృష్ణ భారీ మెజారిటీతో విజయం సాధించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. విజయవాడ ప్రజలు ఆయనపై ఉంచిన విశ్వాసానికి ఈ విజయం నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నగర అభివృద్ధికి రాధాకృష్ణ ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. విజయవాడ నగరంలో మౌలిక సదుపాయాల మెరుగుదల, ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాల అమలులో నూతన మేయర్ కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. వంగవీటి రాధాకృష్ణ నాయకత్వంలో విజయవాడ నగరం మరింత అభివృద్ధి సాధిస్తుందని పెనుగొండ సుబ్బారాయుడు, ప్రత్తిపాటి శ్రీధర్ విశ్వాసం వ్యక్తం చేశారు.

