పోలింగ్ కేంద్రాల్లో ఏసీపీ దామోదర్ తనిఖీలు.. భద్రతా ఏర్పాట్లపై ఆరా!
విజయవాడ తూర్పు నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రాల తనిఖీ… ఆర్సీఎం స్కూల్ వద్ద భద్రతా ఏర్పాట్ల పరిశీలన… పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా పోలీసులకు సూచనలు…

విజయవాడ, నవంబర్ 1: విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో తూర్పు నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాట్లను ఏసీపీ దామోదర్ ఆదివారం పరిశీలించారు. ఆర్సీఎం స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి భద్రతా చర్యలను సమీక్షించారు. పోలింగ్ కేంద్రం పరిసరాల్లో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు, సిబ్బందితో మాట్లాడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడి పోలింగ్ నిర్వహణకు సంబంధించిన వివరాలను సేకరించారు. పోలింగ్ కేంద్రాల వద్ద విధులు నిర్వహిస్తున్న వలంటీర్లతోనూ మాట్లాడారు. పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.

