ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ21, అక్టోబర్ 2026, బుధవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

స్థానిక సమరానికి చంద్రబాబు గెలుపు మంత్రం!

చెప్పాలం.. చేస్తానాం నినాదంతో ప్రచారం చేయాలని చంద్రబాబు పిలుపు… కూటమి పార్టీల మధ్య సమన్వయంతో ముందుకు సాగాలని సూచన… టికెట్ దక్కని నేతలకు నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పిస్తామని హామీ…

V10TV న్యూస్ డెస్క్ 21 అక్టోబర్, 2026 3:48 PMకి 3,572 వీక్షణలు
స్థానిక సమరానికి చంద్రబాబు గెలుపు మంత్రం! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల నేపథ్యంలో పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో ప్రచార వ్యూహాలు, అభ్యర్థుల ఎంపిక, క్షేత్రస్థాయి పరిస్థితులపై పలు సూచనలు చేశారు. ‘చెప్పాం.. చేస్తున్నాం’ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించాలని సూచించారు. కూటమి పార్టీల మధ్య సమన్వయం అత్యంత ముఖ్యమని, వ్యక్తిగత విభేదాలకు తావులేకుండా కలిసి పనిచేయాలని స్పష్టం చేశారు. ఎన్నికల్లో టికెట్లు దక్కని నాయకులు నిరుత్సాహానికి గురికావద్దని, అర్హులైన వారికి భవిష్యత్తులో నామినేటెడ్ పదవుల్లో అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. రెబల్ అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకునేలా పార్టీ నాయకులు చొరవ చూపాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో కూటమి అభ్యర్థుల గెలుపునకు అనుకూల వాతావరణం కల్పించాలని, ప్రతి నాయకుడు బాధ్యతగా పనిచేయాలని చంద్రబాబు సూచించారు. ఎన్నికల్లో సీట్ల సర్దుబాట్లు సాఫీగా జరిగేలా చూడాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

నామినేషన్ల వేళ టీడీపీ–వైసీపీ మధ్య రణరంగం!

1 గంట క్రితం 3,883

ప్రజాస్వామ్యానికి సుప్రీం అండ: పెద్దిరెడ్డి

2 గంటల క్రితం 3,897

మేయర్ బరిలో రాధా బీ ఫారంతో మరో అడుగు!

2 గంటల క్రితం 4,810

సెంట్రల్‌లో టీడీపీ అభ్యర్థులకు బీ ఫారాలు

2 గంటల క్రితం 2,400