ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ31, అక్టోబర్ 2026, శనివారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/క్రైమ్ వార్తలు/వార్త
క్రైమ్ వార్తలు

రూ.65 వేల లంచంతో ఏసీబీ వలలో అగ్నిమాపక అధికారి!

బాణాసంచా దుకాణాల ఫైర్ ఎన్‌ఓసీలకు రూ.75 వేల డిమాండ్… రూ.65 వేలకు బేరం కుదుర్చుకుని అడ్డంగా దొరికిన అధికారి… రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు…

V10TV న్యూస్ డెస్క్ 31 అక్టోబర్, 2026 10:06 AMకి 6,851 వీక్షణలు
రూ.65 వేల లంచంతో ఏసీబీ వలలో అగ్నిమాపక అధికారి! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

రాజమహేంద్రవరం, అక్టోబర్ 30: బాణాసంచా దుకాణాలకు అగ్నిమాపక శాఖ నుంచి నిరభ్యంతర ధ్రువీకరణ పత్రాలు జారీ చేసేందుకు లంచం డిమాండ్ చేసిన సహాయ జిల్లా అగ్నిమాపక అధికారి ఏసీబీ వలకు చిక్కారు. రాజమహేంద్రవరంలో అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న పి. శ్రీనివాస్ శుక్రవారం రూ.65 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారుల కథనం ప్రకారం.. ఐదు బాణాసంచా దుకాణాలు నిర్వహిస్తున్న వ్యాపారికి సంబంధించిన పెసో లైసెన్సులు 2028, 2035 సంవత్సరాల వరకు చెల్లుబాటులో ఉన్నాయి. అయితే దీపావళి సందర్భంగా తాత్కాలిక దుకాణాలకు ఫైర్ ఎన్‌ఓసీలు జారీ చేయడంతో పాటు ఇప్పటికే ఉన్న దుకాణాల్లో తనిఖీలు నిర్వహించేందుకు ఒక్కో దుకాణానికి రూ.15 వేల చొప్పున మొత్తం రూ.75 వేలు ఇవ్వాలని శ్రీనివాస్ డిమాండ్ చేసినట్లు ఫిర్యాదు అందింది. చివరకు రూ.65 వేలకు అంగీకరించినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. లంచం ఇవ్వకపోతే దుకాణాలపై చర్యలు తీసుకుంటామని బెదిరించినట్లు ఫిర్యాదుదారుడు ఆరోపించారు. దీంతో బాధితుడు ఏసీబీ రాజమహేంద్రవరం రేంజ్ అధికారులను ఆశ్రయించారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన అధికారులు పక్కా ప్రణాళికతో వల పన్నారు. శుక్రవారం సాయంత్రం 6.44 గంటల సమయంలో కోటిపల్లి బస్టాండ్ సమీపంలోని కార్యాలయంలో ఫిర్యాదుదారుడి నుంచి రూ.65 వేలు తీసుకుంటుండగా శ్రీనివాస్‌ను పట్టుకున్నారు. లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. ఆయన కుడిచేతి వేళ్లకు నిర్వహించిన రసాయన పరీక్షలో పాజిటివ్‌గా తేలినట్లు అధికారులు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి రాజమహేంద్రవరం ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు వెల్లడించారు. లంచం అడిగితే 1064కు ఫోన్ చేయండి ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజల నుంచి ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే నిర్భయంగా ఫిర్యాదు చేయాలని ఏసీబీ అదనపు ఎస్పీ ఎస్. భావ్య కిషోర్ సూచించారు. ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064 లేదా 9440446102కు సమాచారం అందించాలని కోరారు. తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ, పోలవరం జిల్లాల ప్రజలు అవినీతి నిర్మూలనకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ దాడిలో ఏసీబీ అదనపు ఎస్పీ ఎస్. భావ్య కిషోర్, ఇన్‌స్పెక్టర్లు ఎన్.వి. భాస్కరరావు, డి. వాసుకృష్ణ, వై. సతీష్, కె. గోవిందరాజు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

గుణదలలో నగదు పంపిణీ కలకలం.. రూ.50 వేలు సీజ్!

44 నిమిషాల క్రితం 5,987

తాడేపల్లిలో భూ వివాదం.. మహిళల మధ్య వీధిపోరాటం!

48 నిమిషాల క్రితం 5,958

బెజవాడలో ఓటరు స్లిప్పుల పంపిణీపై గందరగోళం!

51 నిమిషాల క్రితం 4,768

ప్రియుడి కత్తిపోట్లకు ప్రియురాలు బలి!

2 గంటల క్రితం 6,990