గన్నవరంలో ఆగస్టు 19న మెగా జాబ్ మేళా
10కి పైగా ప్రముఖ కంపెనీలు.. సుమారు 650 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు... 10వ తరగతి నుంచి బీటెక్ వరకు చదివిన వారికి ఉద్యోగ అవకాశాలు... 18 నుంచి 35 ఏళ్ల అభ్యర్థులు ధ్రువపత్రాలతో హాజరుకావాలని సూచన...

గన్నవరం, ఆగస్టు 17 (V10TV AP): నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు గన్నవరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఆగస్టు 19న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ నవీన్ తెలిపారు.
ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ జాబ్ మేళాలో 10కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొని సుమారు 650 ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ పూర్తి చేసిన 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అర్హులైన అభ్యర్థులు తమ రెజ్యూమ్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, విద్యార్హత ధ్రువపత్రాలతో జాబ్ మేళాకు హాజరుకావాలని అధికారులు తెలిపారు.

