ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ2, నవంబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/క్రైమ్ వార్తలు/వార్త
క్రైమ్ వార్తలు

గంజాయి దందాపై పోలీసుల ఉక్కుపాదం.. తొమ్మిది మంది అరెస్ట్!

మంగళగిరి, విజయవాడ యువతే లక్ష్యంగా గంజాయి విక్రయాలు… 3.1 కిలోల గంజాయి, కారు స్వాధీనం.. ఆరుగురికి నేర చరిత్ర… 22 కేసుల్లో నిందితుడిగా ఉన్న విజయవాడ రౌడీషీటర్‌ కూడా అరెస్ట్…

V10TV న్యూస్ డెస్క్ 1 నవంబర్, 2026 7:59 PMకి 6,996 వీక్షణలు
గంజాయి దందాపై పోలీసుల ఉక్కుపాదం.. తొమ్మిది మంది అరెస్ట్! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

గుంటూరు, నవంబర్ 1: మంగళగిరి కేంద్రంగా సాగుతున్న గంజాయి అక్రమ విక్రయాల వ్యవహారాన్ని గుంటూరు జిల్లా పోలీసులు ఛేదించారు. యువకులను లక్ష్యంగా చేసుకుని గంజాయి విక్రయిస్తున్నట్లు గుర్తించిన మంగళగిరి రూరల్ పోలీసులు తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 3.1 కిలోల గంజాయి, తూకం యంత్రం, ప్యాకింగ్ సామగ్రి, హ్యుందాయ్ ఎక్స్టర్ కారును స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విలువ సుమారు రూ.62 వేలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ కేసు వివరాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మీడియా సమావేశంలో వెల్లడించారు. కాజ అండర్‌పాస్ వద్ద పట్టుబడ్డ ముఠా అక్టోబర్ 30న రాత్రి 7 గంటల సమయంలో కాజ వెంకటరెడ్డిపాలెం జాతీయ రహదారి అండర్‌పాస్ సమీపంలోని మార్కెట్ సెంటర్ వద్ద గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో నార్త్ డీఎస్పీ కె. వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో మంగళగిరి రూరల్ సీఐ చిరుమామిళ్ల వెంకటేశ్వర్లు సిబ్బందితో కలిసి దాడి నిర్వహించారు. పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించిన తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద ఉన్న బ్యాగుతోపాటు కారులోనూ గంజాయి ప్యాకెట్లను గుర్తించారు. ఈ కేసులో చదల నందమయ్య, పప్పు ఉమానాగు, కావర్ల షణ్ముఖ్, కట్టా మహేష్, మొగిలిశెట్టి లక్ష్మణ్ కళ్యాణ్, వల్లెపు వెంకటేష్ అలియాస్ వెంకటేశ్వరరావు, కుప్పాల శ్రీనివాస్, కోడెబోయిన రంజిత్, తాడిబోయిన కోటేశ్వరరావులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. రూ.68 వేలకు గంజాయి కొనుగోలు! పోలీసుల విచారణలో ప్రధాన నిందితుడు చదల నందమయ్య గంజాయి వ్యాపారానికి సంబంధించిన వివరాలు వెల్లడించినట్లు ఎస్పీ తెలిపారు. పెయింటింగ్ పనులు చేసే నందమయ్య సులభంగా డబ్బు సంపాదించేందుకు గంజాయి విక్రయాలు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. విజయవాడకు చెందిన వెనిగళ్ల పద్మ వద్ద కిలో రూ.17 వేల చొప్పున నాలుగు కిలోల గంజాయిని రూ.68 వేలకు కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. అందులో కొంత గంజాయిని పిడుగురాళ్ల సమీపంలో ఆకాష్ అనే వ్యక్తికి విక్రయించినట్లు, మిగిలిన గంజాయిని చిన్న ప్యాకెట్లుగా తయారుచేసి విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. పప్పు ఉమానాగుపై 22 కేసులు! అరెస్టయిన తొమ్మిది మందిలో ఆరుగురికి నేర చరిత్ర ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఐదుగురిపై గతంలో గంజాయి కేసులు నమోదయ్యాయని, ముగ్గురు రౌడీషీటర్లుగా ఉన్నారని తెలిపారు. ముఖ్యంగా విజయవాడకు చెందిన పప్పు ఉమానాగుపై 22 క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. వాటిలో గంజాయి, పోక్సో, హత్యాయత్నం, అల్లర్లకు సంబంధించిన కేసులు ఉన్నాయని వివరించారు. ఇతనిపై విజయవాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీషీట్ ఉన్నట్లు తెలిపారు. కోడెబోయిన రంజిత్ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో, కట్టా మహేష్ భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీషీటర్లుగా ఉన్నట్లు వెల్లడించారు. పరారీలో మరో ఇద్దరు గంజాయి సరఫరాలో కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వెనిగళ్ల పద్మ, ఆకాష్ పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. వారి ఆచూకీ కోసం ప్రత్యేకంగా గాలింపు చేపట్టినట్లు వెల్లడించారు. మాదకద్రవ్యాల విక్రయాలు, రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు. గంజాయి విక్రయాలపై ప్రజలు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. కేసును ఛేదించిన పోలీసు అధికారులను, సిబ్బందిని అభినందించి రివార్డులు అందజేశారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

బెజవాడ తీర్పుకు కౌంట్‌డౌన్.. రేపే ఓట్ల లెక్కింపు!

3 గంటల క్రితం 3

నీ ధైర్యానికి సెల్యూట్ లక్ష్మీ! 🔥🫡

3 గంటల క్రితం 9,877

సీతారామపురంలో భారీ అగ్నిప్రమాదం.. రూ.4 కోట్ల ఆస్తి నష్టం!

4 గంటల క్రితం 42,546

నిడమానూరులో పరిమి సింధూర ఆధ్వర్యంలో వైసీపీ ఎన్నికల ర్యాలీ!

6 గంటల క్రితం 7,573