అన్నే సాంబశివరావు జన్మదినాన సేవా కార్యక్రమాల షెడ్యూల్
పుట్టినరోజు వేడుకలతో పాటు వరుస సేవా కార్యక్రమాలు... పేద కుటుంబానికి నిత్యావసర సరుకులతో చేయూత.... వేద పాఠశాల విద్యార్థులు, వృద్ధాశ్రమ వాసులకు సరుకుల వితరణ...

విజయవాడ, ఆగస్టు 16 (V10TV AP): లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ సుప్రీమ్ పూర్వ అధ్యక్షులు, జోన్ చైర్పర్సన్ లయన్ అన్నే సాంబశివరావు పుట్టినరోజును సోమవారం సేవా కార్యక్రమాల నడుమ నిర్వహించనున్నట్లు క్లబ్ కార్యదర్శి లయన్ సుంకర నాగభూషణం తెలిపారు. జన్మదిన వేడుకను కేవలం సంబరాలకే పరిమితం చేయకుండా పేదలు, వేద విద్యార్థులు, వృద్ధాశ్రమ వాసులకు అండగా నిలిచేలా పలు కార్యక్రమాలను రూపొందించినట్లు పేర్కొన్నారు.
ఉదయం 9 గంటలకు లోటస్ ల్యాండ్‌మార్క్ బ్లాక్-6, ఆకాష్ టవర్స్‌లోని సాంబశివరావు స్వగృహంలో పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఒక పేద కుటుంబానికి నిత్యావసర పచారీ సరుకులను అందజేయడంతో పాటు హాజరయ్యే క్లబ్ సభ్యులకు అల్పాహారం ఏర్పాటు చేయనున్నారు.
అనంతరం ఉదయం 10 గంటల నుంచి కొత్తూరు తాడేపల్లిలోని శ్రీ షణ్ముఖ వేద పాఠశాల విద్యార్థులకు నిత్యావసర సరుకులు అందజేయనున్నారు. ఖండ్రికలోని కార్నర్ స్టోన్ వృద్ధాశ్రమం వాసులకు కూడా నిత్యావసర పచారీ సరుకులు పంపిణీ చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు శబరి వృద్ధాశ్రమంలోని వృద్ధులకు అన్నదానం నిర్వహించనున్నారు.
క్లబ్ అధ్యక్షులు లయన్ గోటిక నాగిరెడ్డి నాయకత్వంలో, సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమాలను చేపడుతున్నట్లు నాగభూషణం సుంకర తెలిపారు. క్లబ్ సభ్యులందరూ పాల్గొని సేవా కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు.

