అనుమతులు లేకుండా ర్యాలీ.. వైసీపీ నేతలపై కేసు
డీఎస్సీ అక్రమాలపై ఆందోళన పేరుతో విజయవాడలో ర్యాలీ నిబంధనలు ఉల్లంఘించారంటూ మాచవరం పోలీసుల చర్య అనుమతి లేదని ముందే నోటీసులు ఇచ్చినట్లు వెల్లడి

విజయవాడ: నగరంలో అనుమతులు లేకుండా ర్యాలీ నిర్వహించారన్న ఆరోపణలపై వైఎస్సార్సీపీ నేతలపై మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు. డీఎస్సీ అక్రమాలపై ఆందోళనలో భాగంగా సోమవారం వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు.
ర్యాలీ సందర్భంగా పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు రోడ్డుపైకి రావడంతో పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు, ఆందోళనకారుల మధ్య తోపులాట చోటుచేసుకుంది.
ర్యాలీ నిర్వహణకు ముందస్తు అనుమతి లేదని, కార్యక్రమాన్ని నిర్వహించవద్దని వైఎస్సార్సీపీ నేతలకు ముందుగానే నోటీసులు జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు. అయినప్పటికీ నిబంధనలను ఉల్లంఘిస్తూ ర్యాలీ చేపట్టారన్న కారణంతో కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్‌తో పాటు మరికొందరు నేతలపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించడంతోనే చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

