ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ31, అక్టోబర్ 2026, శనివారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

తరగతి గదిలో విద్యార్థినిపై దాడి.. ప్రభుత్వంపై జగన్ ఆగ్రహం!

పాఠశాలలోకి దుండగుడు ప్రవేశించడం ఎలా సాధ్యమైందని ప్రశ్నించిన వైసీపీ అధినేత… కూటమి ప్రభుత్వంలో శాంతిభద్రతలు కుప్పకూలాయని విమర్శ… బాధిత విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్…

V10TV న్యూస్ డెస్క్ 31 అక్టోబర్, 2026 6:57 PMకి 6,981 వీక్షణలు
తరగతి గదిలో విద్యార్థినిపై దాడి.. ప్రభుత్వంపై జగన్ ఆగ్రహం! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

అమరావతి, అక్టోబర్ 31: అనంతపురం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో తరగతి గదిలోనే విద్యార్థినిపై దుండగుడు దాడికి పాల్పడిన ఘటనపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ హయాంలో శాంతిభద్రతలు కుప్పకూలిపోయాయని విమర్శించారు. విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలోకి ఓ దుండగుడు స్వేచ్ఛగా ప్రవేశించి విద్యార్థినిపై దాడి చేయడం ఎలా సాధ్యమైందని ప్రశ్నించారు. దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో విద్యార్థిని కూడా గాయపడటం అత్యంత బాధాకరమని జగన్ పేర్కొన్నారు. విద్యార్థుల భద్రతకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోందని ప్రశ్నించారు. పాలనను పక్కనపెట్టి రాజకీయ కక్ష సాధింపులకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపించారు. దాడిలో గాయపడిన విద్యార్థినులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని, వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలా భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. ఘటనపై పారదర్శకంగా దర్యాప్తు నిర్వహించి, నిందితుడిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోరారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

జగ్గయ్యపేటలో ఎన్నికల బందోబస్తుపై డీసీపీ షరీన్ బేగం ప్రత్యేక నిఘా!

13 నిమిషాల క్రితం 1

పోలింగ్‌కు సర్వం సిద్ధం.. బ్యాలెట్ బాక్సులతో కేంద్రాలకు సిబ్బంది పయనం!

3 గంటల క్రితం 5,486

విజయవాడలో ఎన్నికల వేళ ఖాకీ హెచ్చరిక.. నగదు పంచితే కఠిన చర్యలు!

3 గంటల క్రితం 7,124

కొండపల్లిలో ఖాకీల పహారా.. ఎన్నికల వేళ అడుగడుగునా నిఘా!

3 గంటల క్రితం 6,857