ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ28, అక్టోబర్ 2026, బుధవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

కూటమి అభివృద్ధిని.. ప్రతిపక్ష రాజకీయాలను ప్రజలు గుర్తించాలి!

గుడ్లవల్లేరు మండలంలో రెండో రోజు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఎన్నికల ప్రచారం... కౌతవరం ఎంపీటీసీ సెగ్మెంట్లలో విస్తృత పర్యటన.. అభ్యర్థులకు బీ-ఫారాల అందజేత... ప్రతిపక్షాలకు డిపాజిట్లు దక్కకుండా చేయడమే లక్ష్యమన్న ఎమ్మెల్యే రాము...

V10TV న్యూస్ డెస్క్ 27 అక్టోబర్, 2026 2:58 PMకి 4,860 వీక్షణలు
కూటమి అభివృద్ధిని.. ప్రతిపక్ష రాజకీయాలను ప్రజలు గుర్తించాలి! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

గుడ్లవల్లేరు, అక్టోబర్ 27 : కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను, ఎన్నికల సమయంలోనే కనిపించే ప్రతిపక్ష రాజకీయాలను ప్రజలు గుర్తించాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కోరారు. గుడివాడ నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం రెండో రోజు గుడ్లవల్లేరు మండలంలోని కౌతవరం 1, 2 ఎంపీటీసీ సెగ్మెంట్లలో విస్తృతంగా పర్యటించారు. కూటమి అభ్యర్థులతో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుంటూ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు. ముందుగా ఉమ్మడి కృష్ణా జిల్లా మాజీ టీడీపీ అధ్యక్షుడు వల్లభనేని బాబురావు నివాసంలో మండల పరిధిలోని టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థులకు పార్టీ బీ-ఫారాలను అందజేశారు. అనంతరం గ్రామంలోని భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. కౌతవరం రెండు సెగ్మెంట్ల పరిధిలో పర్యటిస్తూ జనసేన జడ్పీటీసీ అభ్యర్థి వర్రె బలరామకృష్ణకు గాజు గ్లాసు గుర్తుపై, టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థులు యార్లగడ్డ కళ్యాణి, కంచర్ల ప్రకాష్‌లకు సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు. పలుచోట్ల మహిళలు మంగళహారతులతో స్వాగతం పలకగా, డప్పు వాయిద్యాలు, బాణసంచా సందడి మధ్య ప్రచారం కొనసాగింది. ఈ సందర్భంగా వివిధ గ్రామాల్లో నిర్వహించిన ప్రచార సభల్లో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనపై విమర్శలు గుప్పించారు. ప్రజలు నమ్మి అధికారం అప్పగిస్తే వారి సమస్యలను పట్టించుకోలేదని ఆరోపించారు. కనీసం తాగునీటి సౌకర్యం కూడా కల్పించలేని పరిస్థితి గత పాలనలో ఉండేదని విమర్శించారు. ప్రజల కోసం పనిచేయని ప్రతిపక్ష నేతలకు ఇప్పుడు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని వ్యాఖ్యానించారు. ప్రజలతో మమేకమవుతూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీలతో గెలిపించేందుకు నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. తమ లక్ష్యం కేవలం ఎన్నికల్లో గెలవడం మాత్రమే కాదని, ప్రతిపక్ష అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కకుండా చేయడమేనని వ్యాఖ్యానించారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు సమాన స్థాయిలో భారీ మెజారిటీలు సాధించేలా కృషి చేయాలని సూచించారు. ఎన్నికల ఫలితాలపై ధీమా వ్యక్తం చేసినప్పటికీ నాయకులు, కార్యకర్తలు ఎట్టి పరిస్థితుల్లోనూ అలసత్వం ప్రదర్శించవద్దని స్పష్టం చేశారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండే నాయకత్వం అవసరమని, ఎన్నికైన ప్రతినిధులు ప్రజాసేవకు ప్రాధాన్యత ఇవ్వాలని రాము పేర్కొన్నారు. కూటమి శ్రేణులన్నీ ఐకమత్యంగా పనిచేస్తూ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. సాయంత్రం డోకిపర్రు సెగ్మెంట్లలో ప్రచారం కొనసాగించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు పోలవరపు వెంకటరావు, మార్కెట్ యార్డు చైర్మన్ పొట్లూరి రవి, శ్రీ కొండలమ్మ ఆలయ కమిటీ చైర్మన్ ఈడే మోహన్, టీడీపీ నాయకులు సూరపనేని పరంధామయ్య, కొడాలి రామరాజు, అట్లూరి ప్రసాద్, చేకూరు జగన్మోహన్‌రావు, వల్లభనేని వెంకటరావు, వల్లభనేని సుబ్బారావు, పామర్తి సత్తిబాబు, దుగ్గిరాల శేషుబాబు, మల్లిపెద్ది సుబ్రమణ్యం, అబ్దుల్ సత్తార్, వెనిగండ్ల నాగేశ్వరరావు, మద్దాల జోజి, పిచ్చేశ్వరరావు, శివప్రసాద్, రాంబాబు, తూము పద్మజ, జనసేన నాయకులు కళ్యాణపు నవాబు, తోట చిన్నారి, కుప్పినేని శేషవేణి, అడపా బాబి, బీజేపీ నాయకుడు లింగం చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్‌లో మార్పు!

42 నిమిషాల క్రితం 3,281

తుఫానులో బైక్‌పై మంత్రి పర్యటన.. హెల్మెట్ లేకపోవడంపై చర్చ!

47 నిమిషాల క్రితం 3,179

తుపాను తగ్గినా.. పోలీసుల అప్రమత్తత కొనసాగింపు!

58 నిమిషాల క్రితం 3,680

భారీ వర్షాల నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై ఈవో శీనా నాయక్ పరిశీలన

1 గంట క్రితం 3,571