ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ28, అక్టోబర్ 2026, బుధవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

తుపాను తగ్గినా.. పోలీసుల అప్రమత్తత కొనసాగింపు!

భారీ వర్షాల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో సహాయక చర్యలు... లోతట్టు, కొండ ప్రాంతాల ప్రజల భద్రతపై ప్రత్యేక దృష్టి... నిరంతరం పర్యవేక్షిస్తున్న పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు...

V10TV న్యూస్ డెస్క్ 28 అక్టోబర్, 2026 4:49 PMకి 3,680 వీక్షణలు
తుపాను తగ్గినా.. పోలీసుల అప్రమత్తత కొనసాగింపు! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్ 28: ఆర్నాబ్ తుపాను తీరం దాటినప్పటికీ భారీ వర్షాల ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా ముందస్తు జాగ్రత్తలు చేపడుతోంది. పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు కమిషనరేట్ పరిధిలో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. వర్షాల కారణంగా తలెత్తే అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు పోలీసు అధికారులను క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంచారు. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే ప్రమాదం ఉన్నందున ఆయా ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. డీసీపీలు, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, పోలీసు సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిస్థితులను పర్యవేక్షిస్తూ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. రహదారులపై వర్షపు నీరు నిలిచిన ప్రాంతాలను గుర్తించి వాహనదారులను సురక్షిత మార్గాల వైపు మళ్లిస్తున్నారు. ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నారు. పెనుగాలులు, వర్షాల కారణంగా రహదారులపై విరిగిపడిన చెట్లు, విద్యుత్ స్తంభాలను తొలగించేందుకు సంబంధిత సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ చర్యలు చేపట్టారు. ప్రధాన రహదారులపై రాకపోకలకు అంతరాయం కలగకుండా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదకర ప్రాంతాల్లో ప్రజలు సంచరించకుండా అప్రమత్తం చేస్తున్నారు. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో నివసించే ప్రజల భద్రతపై పోలీసు యంత్రాంగం దృష్టి సారించింది. భారీ వర్షాల నేపథ్యంలో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో నివసించే వారిని అప్రమత్తం చేస్తూ అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు చేపడుతున్నారు. అదేవిధంగా వాగులు, వంకల్లో నీటి ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలు వాటిని దాటే ప్రయత్నం చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తుపాను ప్రభావం పూర్తిగా తగ్గే వరకు పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ రాజశేఖర్ బాబు ఆదేశించారు. ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ, అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే స్పందించేలా పోలీసు యంత్రాంగాన్ని సిద్ధంగా ఉంచినట్లు పోలీసు కమిషనర్ కార్యాలయం వెల్లడించింది.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

అల్లిక నాదే... నీ ఓటు నాకే!

24 నిమిషాల క్రితం 5,687

జోరు వానలోనూ తగ్గని ఎన్నికల ప్రచారం

32 నిమిషాల క్రితం 5,795

85వ డివిజన్ అభివృద్ధే ధ్యేయం

36 నిమిషాల క్రితం 5,862

86వ డివిజన్ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తా

41 నిమిషాల క్రితం 4,828