మల్లాది విష్ణుకు విజయదశమి శుభాకాంక్షలు
వైసీపీ రాష్ట్ర కార్యదర్శి షేక్ గౌస్ మొహిద్దిన్ అభినందనలు… పండుగ సందర్భంగా మల్లాది విష్ణును కలిసిన పార్టీ నేతలు… కార్యక్రమంలో పాల్గొన్న సెంట్రల్ నియోజకవర్గ క్లస్టర్ ఇన్‌చార్జిలు…

విజయవాడ, అక్టోబర్ 20: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి, సెంట్రల్ నియోజకవర్గ పరిశీలకులు షేక్ గౌస్ మొహిద్దిన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణును మర్యాదపూర్వకంగా కలిసి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ నియోజకవర్గ క్లస్టర్ ఇన్‌చార్జిలు భోగాది మురళి, పసుపులేటి యేసు, వంశీ తదితరులు పాల్గొన్నారు.

