ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ20, అక్టోబర్ 2026, మంగళవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

రాజరాజేశ్వరి దేవి సన్నిధిలో గవర్నర్ అబ్దుల్ నజీర్

విజయదశమి సందర్భంగా ఇంద్రకీలాద్రిపై గవర్నర్ ప్రత్యేక పూజలు… ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికిన అధికారులు, వేద పండితులు… అమ్మవారి శేషవస్త్రాలు, ప్రసాదం, చిత్రపటాన్ని అందజేసిన ఆలయ అధికారులు…

V10TV న్యూస్ డెస్క్ 20 అక్టోబర్, 2026 3:21 PMకి 3,876 వీక్షణలు
రాజరాజేశ్వరి దేవి సన్నిధిలో గవర్నర్ అబ్దుల్ నజీర్ — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్ 20: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో దర్శనమిచ్చిన కనకదుర్గమ్మను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ మంగళవారం దర్శించుకున్నారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానానికి చేరుకున్న గవర్నర్‌కు ఆలయ అధికారులు, వేద పండితులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ అమ్మవారి అంతరాలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దర్శనం అనంతరం ఆశీర్వచన మండపంలో వేద పండితులు గవర్నర్‌కు వేద మంత్రోచ్ఛారణల మధ్య ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ కార్యదర్శి కె. కన్నబాబు, కమిషనర్ కె. రామచంద్రమోహన్, ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, కార్యనిర్వహణాధికారి వీకే శీనానాయక్ తదితరులు గవర్నర్‌ను సత్కరించి అమ్మవారి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

విజయదశమి వేళ ఇంద్రకీలాద్రికి భక్తజనం పోటెత్తింది!

32 నిమిషాల క్రితం 3,258

వైసీపీ అభ్యర్థులకు బీ ఫారాలు అందజేత

2 గంటల క్రితం 3,871

మల్లాది విష్ణుకు విజయదశమి శుభాకాంక్షలు

2 గంటల క్రితం 3,900

విజయదశమి వేళ భక్తులకు వేడి పాలతో సేద!

2 గంటల క్రితం 6,756