టిప్పర్ను ఢీకొన్న బైక్.. యువకుడి ప్రాణాలు బలి!
మైలవరం–నూజివీడు ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం… వెల్వడం బ్రిడ్జి వద్ద టిప్పర్ను ఢీకొని యువకుడి దుర్మరణం… అతివేగమే కారణమని అనుమానం.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు…

మైలవరం, నవంబర్ 11 : మైలవరం–నూజివీడు ప్రధాన రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. వెల్వడం బ్రిడ్జి సమీపంలో టిప్పర్ను బైక్ ఢీకొన్న ఘటనలో చందాల గ్రామానికి చెందిన సంతోష్ సాయిరాం మృతి చెందాడు. మైలవరం నుంచి తన స్వగ్రామమైన చందాలకు బైక్పై వెళుతుండగా వెల్వడం బ్రిడ్జి వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు. టిప్పర్ను బైక్ ఢీకొనడంతో యువకుడు ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు. అతివేగం కారణంగానే ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు. ప్రమాదానికి దారితీసిన పూర్తి కారణాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.

