కొండపల్లి వైసీపీలో ముగ్గురిపై సస్పెన్షన్ వేటు!
పంచాయతీ ఎన్నికల వేళ పార్టీలో క్రమశిక్షణ చర్యలు… మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేశారంటూ ఫిర్యాదులు… క్రమశిక్షణ కమిటీ సిఫార్సులతో ముగ్గురిపై చర్యలు…

ఇబ్రహీంపట్నం, నవంబర్ 11 : పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి వైసీపీలో కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. గత మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేశారన్న ఫిర్యాదుల నేపథ్యంలో ముగ్గురు నాయకులపై సస్పెన్షన్ వేటు పడింది. కుమ్మరి నాగరాజు, చందా చంటి, మాదుగుల చంద్రశేఖర్‌లను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. పార్టీ అధ్యక్షుడు పోరిక శ్రీనివాస్ రాజు ఆదేశాల మేరకు క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈ క్రమశిక్షణ చర్యలు స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

