ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ8, నవంబర్ 2026, ఆదివారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రజాసాధికారతే మార్గం

మోదీ విధానాలతో ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి… ప్రపంచవ్యాప్తంగా సోషలిజం వైపు అడుగులు… సి.రాఘవాచారి స్మారకోపన్యాసంలో సీపీఐ జాతీయ కార్యదర్శి కాంగో…

V10TV న్యూస్ డెస్క్ 7 నవంబర్, 2026 10:07 PMకి 9,593 వీక్షణలు
ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రజాసాధికారతే మార్గం — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, నవంబర్ 7: ఆర్థిక సమానత్వం, ప్రజల హక్కుల ప్రాతిపదికన ప్రజాస్వామ్యాన్ని నిర్వచించాల్సిన అవసరం ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ భాల్‌చంద్ర ఖండేరావ్ కాంగో అన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో ఆర్థిక అసమానతలు, నిరుద్యోగం పెరిగి ప్రజాస్వామ్యం సంక్షోభంలో పడిందని విమర్శించారు. విశాలాంధ్ర పూర్వ సంపాదకులు చక్రవర్తుల రాఘవాచారి ఏడో వర్ధంతి సందర్భంగా శనివారం విజయవాడ ఎంబీ విజ్ఞాన కేంద్రంలో సి.రాఘవాచారి ట్రస్ట్ ఆధ్వర్యంలో స్మారకోపన్యాసం నిర్వహించారు. ఐజేయూ ప్రధాన కార్యదర్శి డి.సోమసుందర్ అధ్యక్షతన జరిగిన సభలో ‘సంక్షోభంలో ప్రజాస్వామ్యం’ అంశంపై కాంగో ప్రసంగించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు, గౌరవం లభించాలని, ప్రజాసాధికారతతోనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని పేర్కొన్నారు. పాలకులు ఆర్థిక వనరులను ప్రజల సంక్షేమానికి కాకుండా రాజకీయ ప్రయోజనాలకు వినియోగిస్తున్నారని ఆరోపించారు. మీడియాపై ఆంక్షలు, వామపక్ష నాయకుల అరెస్టులు ప్రజాస్వామ్య విలువలకు విఘాతమన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉచిత విద్య, వైద్యం, ఆర్థిక సమానత్వం కోసం ప్రజలు ఉద్యమిస్తున్నారని, అమెరికా ఎన్నికల పరిణామాలు సైతం సోషలిజం వైపు మారుతున్న ఆలోచనలకు సంకేతమని అభిప్రాయపడ్డారు. యువతలో శాస్త్రీయ దృక్పథం పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ కె.జ్యోత్స్న మాట్లాడుతూ పాత్రికేయుల్లో నైతిక విలువలు, యువతలో శాస్త్రీయ ఆలోచనలు పెంపొందించేందుకు ట్రస్ట్ కృషి చేస్తోందన్నారు. తొలుత రాఘవాచారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సీపీఐ జాతీయ నాయకుడు కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య, అక్కినేని వనజ, పారిశ్రామికవేత్త చుక్కపల్లి అరుణకుమార్ తదితరులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

కాలుష్య నియంత్రణ మండలి ఇంజినీర్ ఇంట్లో రూ.18.73 లక్షల

7 గంటల క్రితం 4,857

నడిరోడ్డుపై వ్యక్తిపై కత్తితో దాడి.. ప్రాణాలు కోల్పోయిన రౌడీషీటర్!

8 గంటల క్రితం 6,596

అక్రమాలను ప్రశ్నిస్తే అరెస్టులా?.. చంద్రబాబు సర్కార్‌పై జగన్ ఆగ్రహం!

8 గంటల క్రితం
5,718

బాణసంచా దుకాణాల భద్రతపై కలెక్టర్ ప్రత్యేక నిఘా!

8 గంటల క్రితం 5,555