ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ11, నవంబర్ 2026, బుధవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

కొత్త జెండాతో విజయసాయి రాజకీయ సమరం!

పరివర్తన రాజకీయ పార్టీ’ పేరుతో కొత్త రాజకీయ ప్రస్థానం… తెలుపు, కాషాయ రంగుల్లో ధర్మచక్రంతో పార్టీ జెండా… యువతకు నాయకత్వం.. సమాన అవకాశాలే లక్ష్యమంటూ ప్రకటన…

V10TV న్యూస్ డెస్క్ 11 నవంబర్, 2026 12:09 PMకి 6,794 వీక్షణలు
కొత్త జెండాతో విజయసాయి రాజకీయ సమరం! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, నవంబర్ 11 : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది. మాజీ రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి బుధవారం విజయవాడ వేదికగా తన నూతన రాజకీయ ప్రస్థానానికి శ్రీకారం చుట్టారు. నగరంలోని ఏ కన్వెన్షన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. విడుదలైన వార్తా కథనం ప్రకారం పార్టీకి ‘పరివర్తన రాజకీయ పార్టీ’ (పీఆర్‌పీ)గా నామకరణం చేశారు. కొత్త పార్టీ జెండాలో తెలుపు, కాషాయ రంగులను ఉపయోగించగా, మధ్యలో ధర్మచక్రాన్ని పొందుపరిచినట్లు కథనంలో పేర్కొన్నారు. దేశం కోసం, ధర్మం కోసం తమ పార్టీ పనిచేస్తుందని విజయసాయిరెడ్డి స్పష్టం చేసినట్లు వెల్లడించారు. యువత రాజకీయాల్లోకి రావాలనే లక్ష్యంతో కొత్త పార్టీని ఏర్పాటు చేశామని, ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు, అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలకు ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక అవసరమని విజయసాయిరెడ్డి గతంలోనే పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాలు, ఆంధ్రప్రదేశ్ హక్కుల పరిరక్షణ తమ ప్రధాన లక్ష్యాలని వెల్లడించారు. వైఎస్సార్‌సీపీలో కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంత పార్టీతో రాజకీయ రంగంలోకి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. కొత్త పార్టీ రాష్ట్ర రాజకీయ సమీకరణాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

సాగునీటి ప్రాజెక్టులపై చంద్రబాబు కీలక ఆదేశాలు!

5 నిమిషాల క్రితం 0

ప్రపంచ పెట్టుబడులకు విశాఖ వేదిక!

45 నిమిషాల క్రితం 9,893

మేయర్ రాధా.. పవన్‌తో ఆత్మీయ భేటీ!

2 గంటల క్రితం 6,174

వృద్ధుడి ఖాతాకు సైబర్ గండి.. రూ.24 లక్షలు మాయం!

2 గంటల క్రితం 6,986