ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ4, నవంబర్ 2026, బుధవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

బెజవాడలో వైసీపీకి ఎనిమిది స్థానాలే!

76 డివిజన్ల ఫలితాల్లో కూటమికి భారీ మెజార్టీ... 6, 8, 10, 26, 34, 53, 58, 78 డివిజన్లలో వైసీపీ విజయం... 2021లో 49 స్థానాలు గెలిచిన వైసీపీకి ఈసారి ఘోర పరాభవం...

V10TV న్యూస్ డెస్క్ 4 నవంబర్, 2026 12:16 PMకి 7,599 వీక్షణలు
బెజవాడలో వైసీపీకి ఎనిమిది స్థానాలే! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, నవంబర్ 4: విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. గత ఎన్నికల్లో నగర రాజకీయాల్లో ఆధిపత్యం ప్రదర్శించిన వైసీపీ, ఈసారి కూటమి ప్రభంజనంలో కేవలం ఎనిమిది డివిజన్లకే పరిమితమైంది. అందుబాటులో ఉన్న 76 డివిజన్ల ఫలితాల ప్రకారం వైసీపీ అభ్యర్థులు 6, 8, 10, 26, 34, 53, 58, 78 డివిజన్లలో మాత్రమే విజయం సాధించారు. 2021 నగరపాలక సంస్థ ఎన్నికల్లో 49 స్థానాలను కైవసం చేసుకున్న వైసీపీ, ఈసారి తీవ్రంగా నష్టపోయింది. ప్రభుత్వ వ్యతిరేకతను ఓట్లుగా మలుచుకోవడంలో విఫలమైందా? లేక కూటమి పార్టీల సమన్వయం ముందు నిలవలేకపోయిందా? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. వైసీపీ ఓటమికి గల కారణాలపై రాజకీయ వర్గాల్లో విశ్లేషణలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా నేతల మధ్య సమన్వయ లోపం, స్థానిక నాయకత్వంపై అసంతృప్తి, కూటమి పార్టీల ఉమ్మడి ప్రచారం వంటి అంశాలు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసి ఉండవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నగరంలో తన పట్టును చాటుకుంది. మేయర్ స్థానాన్ని జనసేన అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ భారీ మెజార్టీతో గెలుచుకోవడం కూటమి విజయానికి మరింత బలాన్ని చేకూర్చింది.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

కృష్ణా జిల్లాలో రేపు యథావిధిగా పోలింగ్!

2 గంటల క్రితం 6,904

మూడు ముళ్లకు ముందే శక్తి టీమ్ బ్రేక్!

4 గంటల క్రితం 7,572

బెజవాడ మేయర్ పీఠంపై వంగవీటి జయకేతనం!

7 గంటల క్రితం 52,684

చంద్రబాబు టీమ్‌కు కంగ్రాట్స్ అంటూ జగన్ సెటైర్లు!

17 గంటల క్రితం 9,812