ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ2, ఆగస్టు 2026, ఆదివారం
Advertisement
తాజా వార్తలు
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/క్రైమ్ వార్తలు/వార్త
క్రైమ్ వార్తలు

కృష్ణలంక హత్య కేసులో పరారీలో ఉన్న నిందితుడి కోసం సిట్ ప్రత్యేక విజ్ఞప్తి

ప్రధాన నిందితుడు గురివింద సురేష్ ఆచూకీ తెలిపితే సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి.. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్‌ఐటీ హామీ..

V10TV న్యూస్ డెస్క్ 2 ఆగస్టు, 2026 1:55 PMకి 268 వీక్షణలు
కృష్ణలంక హత్య కేసులో పరారీలో ఉన్న నిందితుడి కోసం సిట్ ప్రత్యేక విజ్ఞప్తి — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ ఆగస్టు 2 (వి 10టివి):విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన హత్య కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు గురివింద సురేష్ (ఏ-4) ఆచూకీ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్‌ఐటీ) ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

కృష్ణలంక పోలీస్ స్టేషన్ క్రైమ్ నంబర్ 107/2026కు సంబంధించిన ఈ కేసులో నిందితుడు ఇప్పటికీ పరారీలో ఉన్నందున, అతని ఆచూకీ తెలిసిన వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరింది. నిందితుడి ఫొటోలు, వివరాలను ప్రజలకు విడుదల చేసిన సిట్, సమాచారం ఇచ్చిన వారి వ్యక్తిగత వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేసింది.

నిందితుడు సుమారు 40 సంవత్సరాల వయస్సు, సత్తెనపల్లెపురం, విజయవాడకు చెందిన వ్యక్తిగా పేర్కొన్నారు. ఎత్తు సుమారు 5 అడుగుల 8 అంగుళాలు, శరీరాకృతి సాధారణం, రంగు తెలుపు, గుండ్రని ముఖం, నలుపు-తెలుపు రంగు జుట్టు ఉన్నట్లు సిట్ తెలిపింది.

పరారీలో ఉన్న నిందితుడికి ఆశ్రయం కల్పించడం, దాచిపెట్టడం లేదా పోలీసులకు సమాచారం ఇవ్వకుండా సహకరించడం చట్టరీత్యా నేరమని ఎస్‌ఐటీ హెచ్చరించింది. నిందితుడి ఆచూకీ తెలిసిన వారు వెంటనే 100 లేదా 112 నంబర్లకు సమాచారం అందించాలని కోరింది.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

జై తెలుగుదేశం.. ఐక్యతతోనే పార్టీ బలోపేతం

5 గంటల క్రితం 966

విజయనగరం జిల్లాలో చారిత్రకంగా ఉన్న పాత విమానాశ్రయము..

9 గంటల క్రితం 1,599

ఆటో డ్రైవర్లే రోడ్డు భద్రతకు రాయబారులు కావాలి: సిఐ రమేష్

20 గంటల క్రితం 683

భోగాపురం రైతన్నలకి ప్రత్యేక గుర్తింపు..

నిన్న 981