వైఎస్సార్ సేవలు చిరస్మరణీయం: దేవినేని అవినాష్
వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన దేవినేని అవినాష్... జలాభిషేకం అనంతరం పండ్ల పంపిణీ... పాల్గొన్న మాజీ డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, మాజీ కార్పొరేటర్లు, పార్టీ శ్రేణులు...


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
విజయవాడ, సెప్టెంబర్ 2: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా విజయవాడ 22వ డివిజన్లో వైఎస్సార్సీపీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు.
22వ డివిజన్ మాజీ కార్పొరేటర్, వైఎస్సార్సీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ తాటిపర్తి కొండారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి దేవినేని అవినాష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం జలాభిషేకం చేశారు.

వైఎస్సార్ ముఖ్యమంత్రిగా పేదలు, రైతులు, విద్యార్థులు, మహిళల సంక్షేమానికి అమలు చేసిన కార్యక్రమాలను నాయకులు గుర్తుచేసుకున్నారు. అనంతరం పండ్లను పంపిణీ చేశారు.
కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, మాజీ కార్పొరేటర్లు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

