పవన్‌కు సీఎం చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు... ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్ష... సంపూర్ణ ఆయురారోగ్యాలతో ప్రజలకు సేవ చేయాలని అభిలాష...

అమరావతి, సెప్టెంబర్ 2: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ప్రజల పట్ల నిబద్ధతతో పనిచేస్తూ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమంలో కీలక పాత్ర పోషిస్తున్న పవన్ కల్యాణ్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో ప్రజలకు మరింతకాలం సేవ చేయాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పవన్ కల్యాణ్‌కు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, జనసేనతో పాటు కూటమి పార్టీల నాయకులు, అభిమానులు సామాజిక మాధ్యమాల వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

