పశ్చిమలో ప్రజల బాటలో బుద్దా వెంకన్న.. ఇంటింటికీ కూటమి సందేశం
45వ డివిజన్‌లో విస్తృతంగా నిర్వహించిన ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమం. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించిన బుద్దా వెంకన్న. భారీగా పాల్గొన్న టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు.


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 45వ డివిజన్‌లో డివిజన్ అధ్యక్షుడు పేరం సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు, పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జ్ బుద్దా వెంకన్న పాల్గొని ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను

వివరించారు. ప్రజల నుంచి వస్తున్న స్పందన ఎంతో సానుకూలంగా ఉందని, పశ్చిమ నియోజకవర్గంలో కార్యక్రమానికి విశేష ఆదరణ లభిస్తోందని బుద్దా వెంకన్న తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో కూటమి ప్రభుత్వం మరింత బలోపేతం అవుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన నాయకులు, మహిళా కార్యకర్తలు, బూత్ కమిటీ సభ్యులు, డివిజన్ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

