ప్రధాని మోదీని కుటుంబ సమేతంగా కలిసిన ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు
చేనేత వస్త్రాలు బహూకరించి శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ... కుటుంబ సభ్యులను ఆత్మీయంగా పలకరించిన ప్రధాని నరేంద్ర మోదీ.. భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని గుర్తు చేస్తూ మంత్రి నారా లోకేష్ నిర్వహణను ప్రశంసించిన ప్రధాని...

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కుటుంబ సమేతంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ప్రధానమంత్రికి సంప్రదాయ చేనేత వస్త్రాలు బహూకరించారు.
సమావేశంలో ప్రధాని మోదీ, అప్పలనాయుడు కుటుంబ సభ్యులను ఆత్మీయంగా పలకరించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇటీవల జరిగిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని గుర్తు చేసుకుంటూ ఆ కార్యక్రమ నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు.
అలాగే కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించడంలో మంత్రి నారా లోకేష్ ప్రదర్శించిన నిర్వహణా నైపుణ్యాలు ప్రశంసనీయమని ప్రధాని మోదీ పేర్కొన్నట్లు సమాచారం. ఈ మర్యాదపూర్వక భేటీలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై కూడా స్వల్పంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

