ఆర్టీసీ ఉద్యోగుల పెన్షన్ సమస్యలపై కీలక భేటీ
▪️ పీఎఫ్, హయ్యర్ పెన్షన్ సమస్యల పరిష్కారంపై విస్తృత చర్చ ▪️ పీఎఫ్ కమిషనర్‌తో ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ, జేఏసీ ప్రతినిధుల సమావేశం ▪️ పెండింగ్ అంశాలపై త్వరితగతిన పరిష్కారం చూపాలని విజ్ఞప్తి

విజయవాడ: ఆర్టీసీ ఉద్యోగుల పీఎఫ్, హయ్యర్ పెన్షన్ సమస్యల పరిష్కారానికి మరో ముందడుగు పడింది. ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్‌తో ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ, జేఏసీ ప్రతినిధులు కీలక సమావేశం నిర్వహించారు. హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో పీఎఫ్, ఈపీఎస్, హయ్యర్ పెన్షన్‌కు సంబంధించిన పెండింగ్ సమస్యలపై విస్తృతంగా చర్చించారు. ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన అన్ని అంశాలను నిర్దిష్ట గడువులో పరిష్కరించాలని ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ హామీ ఇచ్చినట్లు ప్రతినిధులు తెలిపారు.

