ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ1, నవంబర్ 2026, ఆదివారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/క్రైమ్ వార్తలు/వార్త
క్రైమ్ వార్తలు

సమష్టి కృషితో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్!

పోలింగ్ విజయవంతానికి అధికార యంత్రాంగం సమన్వయమే కీలకం… వెయ్యి మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల సేవలు అభినందనీయం… అధికారులు, సిబ్బందికి కలెక్టర్ లక్ష్మీశ, సీపీ రాజశేఖర్ బాబు కృతజ్ఞతలు…

V10TV న్యూస్ డెస్క్ 1 నవంబర్, 2026 10:15 PMకి 9,809 వీక్షణలు
సమష్టి కృషితో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, నవంబర్ 1: ఎన్టీఆర్ జిల్లాలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగియడానికి వివిధ శాఖల అధికారులు, సిబ్బంది సమష్టి కృషి, సమన్వయమే కారణమని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ, నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్ బాబు పేర్కొన్నారు. ఆదివారం జరిగిన పోలింగ్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు అంకితభావంతో పనిచేసిన ప్రతి ఒక్కరికీ సంయుక్తంగా అభినందనలు తెలిపారు. పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ తదితర శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో విధులు నిర్వర్తించడం వల్ల ఎన్నికల ప్రక్రియ సజావుగా కొనసాగిందన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద అవసరమైన ఏర్పాట్లు చేయడంతో పాటు ఓటర్లకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారని వివరించారు. క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ, సిబ్బంది బాధ్యతాయుతమైన విధుల నిర్వహణ పోలింగ్ విజయవంతానికి దోహదపడ్డాయని తెలిపారు. వాలంటీర్ల సేవలకు ప్రత్యేక ప్రశంసలు పోలింగ్ కేంద్రాల్లో దాదాపు వెయ్యి మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు అందించిన సేవలను కలెక్టర్, సీపీ ప్రత్యేకంగా అభినందించారు. ఓటర్లకు సహాయం అందించడం, క్యూలైన్లను క్రమబద్ధీకరించడం, రద్దీని నియంత్రించడం వంటి విధుల్లో వాలంటీర్లు చురుగ్గా పాల్గొన్నారని పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణలో యువత చూపిన సేవా దృక్పథం ప్రశంసనీయమన్నారు. పోలింగ్ విధుల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన అన్ని శాఖల అధికారులు, సిబ్బంది, వాలంటీర్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

గంజాయి దందాపై పోలీసుల ఉక్కుపాదం.. తొమ్మిది మంది అరెస్ట్!

4 గంటల క్రితం 6,992

పులివెందులలో జగన్ సంచలన ప్రకటన.. ‘నేను ఓటు వేయను!’

8 గంటల క్రితం 9,656

బెజవాడలో ఓటుకు దూరంగా మెజారిటీ ఓటర్లు!

8 గంటల క్రితం 8,669

పులివెందుల ఆర్వో ఆఫీస్ వద్ద ఉద్రిక్తత.. జగన్ నేలపై కూర్చొని నిరసన!

9 గంటల క్రితం 9,566