ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ8, నవంబర్ 2026, ఆదివారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

ఓటమిలోనూ అండగా.. అభ్యర్థులకు చింతమనేని భరోసా!

గెలుపోటములు సహజమే.. అధైర్యపడొద్దంటూ ధైర్యం... ఓడిన ఇద్దరు కూటమి అభ్యర్థుల ఇళ్లకు స్వయంగా ఎమ్మెల్యే... ప్రజాసేవలో ముందుండాలని సూచన.. అన్ని విధాలా అండగా ఉంటానని హామీ...

V10TV న్యూస్ డెస్క్ 8 నవంబర్, 2026 11:05 AMకి 8,556 వీక్షణలు
ఓటమిలోనూ అండగా.. అభ్యర్థులకు చింతమనేని భరోసా! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

పెదవేగి, నవంబర్ 8: ఎన్నికల్లో గెలిచిన వారితో సంబరాలు చేసుకోవడమే కాదు.. ఓటమి పాలైన అభ్యర్థులకు సైతం అండగా నిలవాలని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో పరాజయం పాలైన ఇద్దరు కూటమి అభ్యర్థులను ఆయన స్వయంగా వారి ఇళ్లకు వెళ్లి పరామర్శించారు. శనివారం వెలువడిన ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల అనంతరం పెదవేగి మండలంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పర్యటించారు. లక్ష్మీపురం ఎంపీటీసీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి చెందిన మేకా నాగమణి, కూచింపూడి ఎంపీటీసీ స్థానం నుంచి పోటీ చేసిన గిత్తా దేవికారాణి వీరాస్వామి కుటుంబాలను కలిసి ధైర్యం చెప్పారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, ఓటమిని చూసి నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని అభ్యర్థులకు సూచించారు. ప్రజల కోసం చేసిన కృషి వృథా కాదని, ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా ప్రజాసేవలో కొనసాగాలని కోరారు.భవిష్యత్తులో వారికి సముచిత ప్రాధాన్యం కల్పించడంతో పాటు అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. నియోజకవర్గంలో కూటమి విజయాలు సాధించిన నేపథ్యంలో ఓటమి చెందిన అభ్యర్థులను కూడా ఎమ్మెల్యే స్వయంగా కలవడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపిందని స్థానిక నాయకులు పేర్కొన్నారు. అభ్యర్థుల కృషిని గుర్తించి వారికి ధైర్యం చెప్పడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రజాసాధికారతే మార్గం

14 గంటల క్రితం 9,599

కాలుష్య నియంత్రణ మండలి ఇంజినీర్ ఇంట్లో రూ.18.73 లక్షల

18 గంటల క్రితం 4,858

నడిరోడ్డుపై వ్యక్తిపై కత్తితో దాడి.. ప్రాణాలు కోల్పోయిన రౌడీషీటర్!

19 గంటల క్రితం
6,599

అక్రమాలను ప్రశ్నిస్తే అరెస్టులా?.. చంద్రబాబు సర్కార్‌పై జగన్ ఆగ్రహం!

19 గంటల క్రితం 5,721