ఇంద్రకీలాద్రిపై నాగుల చవితి వేడుకలు
నాగపుట్ట వద్ద వైభవంగా ప్రత్యేక పూజలు... వేదమంత్రోచ్ఛారణల నడుమ వైదిక కార్యక్రమాలు... పూజల్లో పాల్గొన్న ఈవో శీనా నాయక్ దంపతులు...

విజయవాడ, నవంబర్ 13: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో నాగుల చవితి వేడుకలు వైభవంగా నిర్వహించారు. నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలోని శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో నాగపుట్ట వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఆలయ స్థానాచార్యుల ఆధ్వర్యంలో వేదమంత్రోచ్ఛారణల నడుమ సంప్రదాయబద్ధంగా వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి వీకే శీనా నాయక్ దంపతులు ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. నాగుల చవితి సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

