కనకదుర్గమ్మకు బంగారు హారం కానుక!
38.700 గ్రాముల బంగారు హారం సమర్పించిన భక్తుడు... ముంబైకి చెందిన జి.వి. వంశీకృష్ణ కుటుంబం ఉదారత... దాత కుటుంబ సభ్యులను సత్కరించిన ఈవో శీనా నాయక్...

విజయవాడ, నవంబర్ 13: ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మకు ఓ భక్తుడు బంగారు హారాన్ని కానుకగా సమర్పించారు. ముంబైలోని చెంబూరు ప్రాంతానికి చెందిన జి.వి. వంశీకృష్ణ శుక్రవారం అమ్మవారిపై భక్తిశ్రద్ధలతో 38.700 గ్రాముల బరువున్న బంగారు హారాన్ని దేవస్థానానికి విరాళంగా అందజేశారు. ఈ బంగారు హారాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి వీకే శీనా నాయక్‌కు అందజేయగా, ఆలయ అధికారులు దాతకు అధికారిక రసీదును అందించారు. అనంతరం దాత కుటుంబ సభ్యులకు అమ్మవారి ప్రత్యేక దర్శనం కల్పించారు. వేదపండితుల ఆశీర్వచనాల అనంతరం అమ్మవారి శేషవస్త్రం, చిత్రపటం, లడ్డూ ప్రసాదాలను అందజేసి సత్కరించారు. అమ్మవారిపై భక్తితో బంగారు ఆభరణాన్ని సమర్పించిన దాతకు ఆలయ అధికారులు అభినందనలు తెలిపారు.

