ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ13, నవంబర్ 2026, శుక్రవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

పుట్టింటికి వచ్చిన వివాహిత అదృశ్యం!

పైడిపల్లిలో కనిపించకుండా పోయిన 19 ఏళ్ల కీర్తి... పొలం పనులకు తండ్రి.. విధులకు తల్లి వెళ్లిన సమయంలో అదృశ్యం... తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు.. ఆచూకీ కోసం పోలీసుల దర్యాప్తు...

V10TV న్యూస్ డెస్క్ 13 నవంబర్, 2026 11:11 AMకి 7,523 వీక్షణలు
పుట్టింటికి వచ్చిన వివాహిత అదృశ్యం! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

తిరుపతి, నవంబర్ 13: పుట్టింటికి వచ్చిన 19 ఏళ్ల వివాహిత అనుమానాస్పద పరిస్థితుల్లో అదృశ్యమైన ఘటన తిరుపతి రూరల్ మండలం పైడిపల్లిలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంతగా గాలించినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పైడిపల్లికి చెందిన లక్ష్మీదేవి, రామయ్య దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇద్దరికీ తల్లిదండ్రులు వివాహాలు జరిపించారు. చిన్న కుమార్తె కీర్తి (19)కి గతేడాది అక్టోబర్‌లో చిత్తూరుకు చెందిన జ్యోతిష్‌తో కాణిపాకం ఆలయ ప్రాంగణంలో పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. వివాహానంతరం కీర్తి అప్పుడప్పుడు పైడిపల్లిలోని తల్లిదండ్రుల ఇంటికి వచ్చి వెళ్తుండేది. ఈ క్రమంలో అక్టోబర్ 30న పుట్టింటికి వచ్చింది. నవంబర్ 4న తండ్రి రామయ్య పొలం పనులకు వెళ్లగా, తల్లి లక్ష్మీదేవి ఆసుపత్రిలో విధులకు వెళ్లారు. అనంతరం పొలం నుంచి ఇంటికి తిరిగి వచ్చిన రామయ్యకు కుమార్తె కనిపించలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినప్పటికీ ఆమె ఆచూకీ లభించలేదు. కుమార్తె కనిపించకపోవడంతో తల్లి లక్ష్మీదేవి తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు క్రైమ్ నంబర్ 391/2026 కింద కేసు నమోదు చేశారు. కీర్తి అదృశ్యానికి సంబంధించిన పరిస్థితులపై తిరుపతి రూరల్ ఎస్సై శ్రీరామ్ దర్యాప్తు చేపట్టారు. ఆమె ఆచూకీ కోసం విచారణ కొనసాగుతోంది.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

పల్లె పోరుకు మోగిన నగారా!

1 గంట క్రితం 0

సర్పంచ్ పదవికి.. కోటిన్నర ఆఫర్!

2 గంటల క్రితం 7,360

అభివృద్ధి ప్రచారం.. అంకెల గారడీ!

2 గంటల క్రితం 6,900

ప్రశ్నాపత్రం పాతదే.. పరీక్ష మాత్రం కొత్తదా!

3 గంటల క్రితం 7,602