ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ2, నవంబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/క్రైమ్ వార్తలు/వార్త
క్రైమ్ వార్తలు

ప్రేమ పేరుతో వేధింపులు.. యువకుడి అరెస్ట్

మైనర్ బాలికను ఏడాది కాలంగా వేధిస్తున్నట్లు ఆరోపణ... పెద్దల సమక్షంలో హెచ్చరించినా తీరు మార్చుకోలేదని ఫిర్యాదు... బీఎన్ఎస్, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలింపు...

V10TV న్యూస్ డెస్క్ 22 ఆగస్టు, 2026 12:29 PMకి 1,566 వీక్షణలు
ప్రేమ పేరుతో వేధింపులు.. యువకుడి అరెస్ట్ — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

మైలవరం: మైనర్ బాలికను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడన్న ఆరోపణలపై ఓ యువకుడిని మైలవరం పోలీసులు అరెస్ట్ చేశారు. బాలికను ఏడాది కాలంగా ప్రేమ పేరుతో ద్విచక్ర వాహనంపై వెంబడిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నాడన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు.

పోలీసులకు అందిన ఫిర్యాదు వివరాల ప్రకారం.. మైలవరం మండలానికి చెందిన మైనర్ బాలికను యువకుడు కొంతకాలంగా ప్రేమ పేరుతో వెంబడిస్తూ వేధిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం గతంలో కుటుంబ సభ్యుల దృష్టికి రావడంతో పెద్దల సమక్షంలో యువకుడిని హెచ్చరించినట్లు సమాచారం.

అయినప్పటికీ అతడి ప్రవర్తనలో మార్పు రాలేదని, వేధింపులు కొనసాగినట్లు బాలిక కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు.

బాలిక మైనర్ కావడంతో నిందితుడిపై సంబంధిత బీఎన్ఎస్ సెక్షన్లతో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. యువకుడిని అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై సుధాకర్ వెల్లడించారు. బాలికలు, మహిళల భద్రత విషయంలో రాజీ లేదని పోలీసులు స్పష్టం చేశారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

సమష్టి కృషితో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్!

12 గంటల క్రితం 9,813

గంజాయి దందాపై పోలీసుల ఉక్కుపాదం.. తొమ్మిది మంది అరెస్ట్!

14 గంటల క్రితం 6,995

పులివెందులలో జగన్ సంచలన ప్రకటన.. ‘నేను ఓటు వేయను!’

19 గంటల క్రితం 9,657

బెజవాడలో ఓటుకు దూరంగా మెజారిటీ ఓటర్లు!

19 గంటల క్రితం 8,669