అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు.. దుకాణంలోకి దూసుకెళ్లిన వైనం!
బస్టాండ్ నుంచి బయటకు వస్తుండగా అదుపుతప్పిన బస్సు… రోడ్డు పక్కనే ఉన్న దుకాణంలోకి దూసుకెళ్లడంతో కలకలం… ప్రాణాపాయం తప్పడంతో ఊపిరి పీల్చుకున్న స్థానికులు…

చల్లపల్లి, నవంబర్ 10 : కృష్ణా జిల్లా చల్లపల్లిలో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న దుకాణంలోకి దూసుకెళ్లిన ఘటన కలకలం రేపింది. చల్లపల్లి బస్టాండ్ నుంచి బయటకు వస్తున్న ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి సమీపంలోని దుకాణంలోకి దూసుకెళ్లింది. ఊహించని ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అయితే అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బస్సు అదుపుతప్పడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

