పొన్నమండ లక్ష్మణ స్వామి వర్మకు ఘన నివాళులు
► అగ్నికుల క్షత్రియుల జాతిపిత జయంతి సందర్భంగా చిత్రపటానికి పుష్పాంజలి... ► సామాజిక సంస్కర్తగా, ఆయుర్వేద వైద్యునిగా వర్మ సేవలను స్మరించిన సీఎం చంద్రబాబు... ► ఆయన ఆశయాలకు గౌరవంగా జయంతిని రాష్ట్ర ఉత్సవంగా నిర్వహిస్తున్నామని వెల్లడి...

అగ్నికుల క్షత్రియుల జాతిపిత పొన్నమండ లక్ష్మణ స్వామి వర్మ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. గొప్ప సామాజిక సంస్కర్తగా, ఆయుర్వేద వైద్యునిగా, అగ్నికుల క్షత్రియ సమాజానికి గుర్తింపు, గౌరవం తీసుకురావడంలో వర్మ చేసిన సేవలు చిరస్మరణీయమని సీఎం కొనియాడారు. ఆయన ఆశయాలు, స్ఫూర్తిని భావితరాలకు చేరవేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పొన్నమండ లక్ష్మణ స్వామి వర్మ జయంతిని రాష్ట్ర ఉత్సవంగా నిర్వహిస్తోందని తెలిపారు. సమాజ అభ్యున్నతికి ఆయన అందించిన విశిష్ట సేవలను స్మరించుకుంటూ సీఎం జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు.

