మచిలీపట్నం మేయర్గా అబ్దుల్ అబీదా ఘన విజయం!
32,473 ఓట్ల భారీ మెజారిటీతో కూటమి అభ్యర్థి గెలుపు... వైసీపీ అభ్యర్థి లంక జ్యోతిపై తిరుగులేని ఆధిక్యం... మేయర్ పీఠం కూటమి కైవసం.. శ్రేణుల్లో ఆనందోత్సాహాలు...

మచిలీపట్నం, నవంబర్ 3 : మచిలీపట్నం నగరపాలక సంస్థ మేయర్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి అబ్దుల్ అబీదా ఘన విజయం సాధించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లంక జ్యోతిపై 32,473 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొంది మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు. అబ్దుల్ అబీదాకు మొత్తం 62,678 ఓట్లు పోలవగా, ఆమె సమీప ప్రత్యర్థి లంక జ్యోతికి 30,205 ఓట్లు లభించాయి. ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచి ఆధిక్యాన్ని ప్రదర్శించిన అబీదా చివరకు భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఈ ఫలితంతో మచిలీపట్నం నగరపాలక సంస్థపై కూటమి జెండా ఎగిరింది. అబీదా విజయంతో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి.

