మురసు తుఫాన్ ఎఫెక్ట్.. రోడ్లపై ట్రాఫిక్ పోలీసుల అప్రమత్తం!
వర్షాలతో విజయవాడలో రహదారులపై నీటి నిల్వలు… వీఎంసీ సిబ్బందితో కలిసి రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు… వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా ప్రత్యేక చర్యలు…

విజయవాడ, నవంబర్ 3: మురసు తుఫాను ప్రభావంతో విజయవాడ నగరంలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు, విజయవాడ నగరపాలక సంస్థ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ప్రధాన రహదారులు, కూడళ్లలో వర్షపు నీరు నిలిచి వాహనదారులు ఇబ్బందులు పడకుండా క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం ఆధ్వర్యంలో ట్రాఫిక్ ఏసీపీలు, సిబ్బంది నగరవ్యాప్తంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. వర్షపు నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి వీఎంసీ సిబ్బంది సహకారంతో నీటి నిల్వలను తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ట్రాఫిక్కు అంతరాయం లేకుండా చర్యలు ప్రధాన కూడళ్లు, రద్దీ రహదారుల్లో వాహనాల రాకపోకలను నిరంతరం పర్యవేక్షిస్తూ ట్రాఫిక్ సజావుగా సాగేలా పోలీసులు చర్యలు చేపడుతున్నారు. వర్షాల సమయంలో వాహనదారులు వేగాన్ని తగ్గించి జాగ్రత్తగా ప్రయాణించాలని, నీరు నిలిచిన ప్రాంతాల్లో సూచించారు. పోలీసుల సూచనలు పాటించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరారు.

