ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ4, నవంబర్ 2026, బుధవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

సెంట్రల్‌లో కూటమి జయకేతనం!

29 డివిజన్లలో 28 స్థానాలు కూటమి కైవసం... ప్రజల నమ్మకాన్ని అభివృద్ధితో నిలబెట్టుకుంటాం: బొండా ఉమా... విజేతల సన్మానంలో ఎమ్మెల్యే బొండా ఉమా, యువనేత సిద్ధార్థ...

V10TV న్యూస్ డెస్క్ 4 నవంబర్, 2026 3:35 PMకి 9,843 వీక్షణలు
సెంట్రల్‌లో కూటమి జయకేతనం! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, నవంబర్ 4: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు మున్సిపల్ ఎన్నికల్లో భారీ విజయాన్ని సాధించారని ప్రభుత్వ విప్, సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు. నియోజకవర్గంలోని 29 కార్పొరేటర్ స్థానాలకు గాను 28 స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించడం చారిత్రాత్మకమని పేర్కొన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పు తమపై మరింత బాధ్యతను పెంచిందని, వారి నమ్మకాన్ని అభివృద్ధి రూపంలో తిరిగి అందిస్తామని స్పష్టం చేశారు. బుధవారం సింగ్‌నగర్‌లోని ఎమ్మెల్యే కార్యాలయంలో గెలుపొందిన కూటమి కార్పొరేటర్లను బొండా ఉమామహేశ్వరరావు, టీడీపీ యువనేత బొండా సిద్ధార్థ సన్మానించారు. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు మద్దతు పలికారని అభిప్రాయపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి ఉంటామని తెలిపారు. యువతకు రాజకీయాల్లో ప్రాధాన్యం యువతకు రాజకీయాల్లో ప్రాధాన్యం రాజకీయాల్లో యువతకు మరిన్ని అవకాశాలు కల్పించాలన్నది కూటమి నాయకత్వ లక్ష్యమని బొండా ఉమా పేర్కొన్నారు. యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తూనే అనుభవజ్ఞుల సేవలను వినియోగించుకుంటామని చెప్పారు. జనసేన నాయకుడు వంగవీటి రాధాకృష్ణకు అవకాశం కల్పించడాన్ని స్వాగతించారు. నగరాభివృద్ధికి సమష్టి కార్యాచరణ విజయవాడ అభివృద్ధి కోసం ఎంపీ, ముగ్గురు ఎమ్మెల్యేలు, మేయర్, 86 మంది కార్పొరేటర్లు సమన్వయంతో పనిచేస్తామని బొండా ఉమా వెల్లడించారు. పార్టీలకు అతీతంగా ప్రజా సమస్యల పరిష్కారం, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. ఈ విజయాన్ని అందించిన సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

ఎన్నికల వేళ ఖాకీల హైఅలర్ట్!

4 నిమిషాల క్రితం 7,460

ప్రజా తీర్పే శిరోధార్యం.. ఓడినా ప్రజాసేవ ఆగదు!

36 నిమిషాల క్రితం 7,879

వెలంపల్లి ఆశీస్సులతో అభివృద్ధి బాటలో 58వ డివిజన్!

2 గంటల క్రితం 6,853

బెజవాడ ప్రజల నమ్మకాన్ని నిలబెడతా: వంగవీటి!

2 గంటల క్రితం 7,601