వెలంపల్లి ఆశీస్సులతో అభివృద్ధి బాటలో 58వ డివిజన్!
58వ డివిజన్ కార్పొరేటర్‌గా బోయలపల్లి ప్రియా మాధురి ఘన విజయం... మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావును కలిసి కృతజ్ఞతలు తెలిపిన నూతన కార్పొరేటర్... ప్రజా సమస్యల పరిష్కారానికి అండగా ఉంటానని వెలంపల్లి భరోసా...

విజయవాడ, నవంబర్ 4: విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో 58వ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా ఘన విజయం సాధించిన బోయలపల్లి ప్రియా మాధురి, మదిరి స్వామి వివేకానందతో కలిసి మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావును మర్యాదపూర్వకంగా కలిశారు. బ్రాహ్మణ వీధిలోని ఆయన కార్యాలయంలో సమావేశమై ఎన్నికల్లో తన విజయానికి సహకరించి, వెన్నంటి నిలిచినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా నూతన కార్పొరేటర్ బోయలపల్లి ప్రియా మాధురి, మదిరి స్వామి వివేకానందలను వెలంపల్లి శ్రీనివాసరావు శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ప్రజలు అందించిన విజయాన్ని బాధ్యతగా స్వీకరించి, డివిజన్ అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని సూచించారు. 58వ డివిజన్లో మౌలిక వసతుల కల్పన, పారిశుద్ధ్యం, తాగునీరు, రహదారులు, వీధిదీపాలు వంటి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆకాంక్షించారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. డివిజన్‌ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు తనవంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని వెలంపల్లి శ్రీనివాసరావు భరోసా ఇచ్చారు. తనపై నమ్మకంతో గెలిపించిన ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తానని బోయలపల్లి ప్రియా మాధురి తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్‌కు చెందిన పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

