విధిలో గాయం.. ఖాకీకి ఎస్పీ భరోసా
కంకిపాడు హెల్త్ సెంటర్‌లో చికిత్స వివరాలపై వైద్యులతో ఆరా... మెరుగైన వైద్యం అవసరమైతే వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం... ‘‘పోలీసు శాఖ అన్ని విధాలా అండగా ఉంటుంది’’ అంటూ కానిస్టేబుల్‌కు ధైర్యం...

V10TV ప్రతినిధి, మచిలీపట్నం: విధి నిర్వహణలో నిందితుడి కత్తి దాడిలో గాయపడిన కానిస్టేబుల్‌ను కృష్ణా జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు పరామర్శించారు. కంకిపాడులోని హెల్త్ సెంటర్‌కు వెళ్లిన ఎస్పీ కానిస్టేబుల్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
వైద్యులతో మాట్లాడి ప్రస్తుతం అందుతున్న చికిత్స వివరాలను తెలుసుకున్నారు. అవసరమైతే మెరుగైన వైద్యం కోసం ఉన్నత వైద్య కేంద్రానికి తరలించాలని, చికిత్సలో ఎలాంటి లోటు లేకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విధి నిర్వహణలో గాయపడిన సిబ్బందికి పోలీసుశాఖ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
అనంతరం ఘటన జరిగిన ప్రాంతాన్ని ఎస్పీ స్వయంగా పరిశీలించారు. నిందితుడి కదలికలు, పోలీసులపై జరిగిన దాడి, అతడిని అదుపులోకి తీసుకున్న తీరు, కేసు దర్యాప్తు పురోగతిపై అధికారులతో సమీక్షించారు.

