మల్లాది విష్ణు అరెస్ట్‌కు యత్నం..? ఉద్రిక్తత
నిరసన దీక్షకు వెళ్తుండగా పోలీసుల అడ్డగింత పోలీసుల తీరుపై మండిపడ్డ వైసీపీ నేత మల్లాది విష్ణు వాగ్వాదంతో ఉద్రిక్తంగా మారిన ముత్యాలంపాడు

విజయవాడ ముత్యాలంపాడులో నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమానికి వెళ్తున్న వైసీపీ నేత మల్లాది విష్ణును పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు అడ్డుకోవడంపై మల్లాది విష్ణు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ అధికారులను ప్రశ్నించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు పోలీసుల తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. ఇరువర్గాల మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకోగా, పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

